అమ్మాయిలను తమ వైపు ఆకర్షించాలంటే ఇలా చేయాలి.. అలా చేయాలని అందరూ చెబుతుంటారు. కానీ... తనకు నచ్చిన అబ్బాయిని తనవైపు తిప్పుకోవడం ఎలా అనే విషయం మాత్రం.. అమ్మాయిలకు ఎవరూ సలహా ఇవ్వరు.
అయితే.. దీనిపై ఒ సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. కొంత మంది యువకులపై చేసిన సర్వేలో.. వాళ్లు.. తమను ఇలా ఇంప్రెస్ చేసిన అమ్మాయిల వైపే మొగ్గు చూపుతాతమంటూ చెప్పడం విశేషం. అవేంటో మీరు చూసేయండి..
పొగడితే.. ఎలాంటి అమ్మాయి అయినా.. ఈజీగా పడిపోతుంది. అయితే.. పొగిడితే అమ్మాయిలే కాదు..అబ్బాయిలు కూడా ఈజీగా పడిపోతారు.
కాకపోతే ఆ పొగడ్త వారికి నిజం అని నమ్మేలా అనిపించాలి. అలా కనుక పొగిడితే... వాళ్లు ఇక మీకు దాసోహం అయిపోయినట్టే అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దామా..
1. లుక్స్... మగవారికి వాళ్ల లుక్స్.. శరీర సౌష్టవం గురించి పొగిడించుకోవడం అంటే బాగా ఇష్టం. మీకు కుదిరినప్పుడల్లా అతడి అంగాంగ సౌష్టవాన్ని మెచ్చుకోండి. అతడి కండరాలు చివరగా ఎత్తైన ఛాతీ ఆకారానికి తగిన కితాబివ్వండి.
2. బూట్లను.. షూస్ ను గమనించి దాని గురించి మెచ్చుకుంటే అబ్బాయిలు బాగా ఇష్టపడతారు. చాలా మందికి తాము మంచి షూస్ వేసుకొని అందరూ గమనించాలని కోరుకుంటారు.
3. హెయిర్ స్టైల్.. మగవాళ్లు కొత్త, ట్రెండీ హెయిర్‌స్టైళ్లను ఫాలో అవ్వాలనుకుంటారు. చిన్నగా, ట్రిమ్ చేసుకున్నా, లాంగ్ హెయిర్ పెంచినా తమదైన శైలిలో ఉంటారు. అమ్మాయిలు మీ కోసమే అబ్బాయిలు నీట్‌గా రెడీ అయ్యేది! మరి కాస్త వారిని ఓ లుక్కేయండి!
4. కేరింగ్.. రిలేషన్‌షిప్ లో కొనసాగుతున్నవారైతే అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటే ఆ విషయం మీరు గమనిస్తున్నారన్నది అతడికి అర్థమవ్వాలి.
5.ఎమోషన్స్.. మగవాళ్లు పైకి కనిపించే కఠినంగా ఉండరు. లోపల చాలా మృదుస్వభావులు. దాన్ని ప్రపంచానికి చూపించాలనుకోరు. వారి ఎమోషనల్ ఫీలింగ్స్‌ను పొగిడేటప్పుడు నిజాయతీగా వ్యవహరించండి.
6.సెన్సాఫ్ హ్యుమర్.. ప్రతి నలుగురు మగాళ్లలో ఒకరికి మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉంటుంట. మీ ప్రియుడు అలాంటివాడైతే నిజంగా మీరు చాలా అదృష్టవంతులే. ఆ విషయాన్ని కూడా మీరు వాళ్లకి తెలియజేస్తూ ఉండాలి.