కోవిడ్ రోగిలో వింత లక్షణం... పురుషాంగం నాలుగు గంటలు స్తంభించి..

First Published Jul 4, 2020, 12:44 PM IST

రోగి పురుషాంగం నాలుగు గంటలపాటు స్తంభించి ఉండడంతో డాక్టర్లు అవాక్కయ్యారు. 

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. రోజు రోజుకీ ఈ వైరస్ కి సంబంధించి కొత్త లక్షణం బయటపడుతోంది.
undefined
ఇప్పటి వరకు జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మాత్రమే ఈ వైరస్ లక్షణాలు అనుకున్నారు. కానీ.. ఆ తర్వాత డయేరియా, వాంతులు, వికారం కూడా కరోనా వైరస్ లక్షణమేనని చెప్పారు. తాజాగా.. కోవిడ్ రోగుల్లో మరి కొత్త లక్షణాలు కూడా కనపడుతున్నాయి.
undefined
కరోనా బారిన పడ్డ 62 ఏళ్ల రోగి పురుషాంగం నాలుగు గంటలపాటు స్తంభించి ఉండడంతో డాక్టర్లు అవాక్కయ్యారు.
undefined
కరోనా సోకడం వల్ల ఆ రోగి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగలేదని, పురుషాంగంలో రక్తం సరఫరాలో అంతరాయం వల్ల అంగం అంతసేపు స్తంభించిందని వారు గుర్తించారు.
undefined
ఈ రకమైన పరిస్థితిని ప్రియాపిజమ్ అంటారని, గతంలో ఆ రోగికి అ అటువంటిది ఎపుడూ జరగలేదని వైద్యులు గుర్తించారు.
undefined
ఆ రోగి రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు….నలుపు రంగులో రక్తం గట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆ రోగి శరీరంలో అధికశాతంలో కార్బన్ డయాక్సైడ్, తక్కువ శాతంలో ఆక్సిజన్ శాతాలున్నాయని వైద్యులు తెలిపారు.
undefined
ఆసుపత్రిలో చేరేటపుడు ఆ రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని…14 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన తర్వాత వెంటిలేటర్ తొలగించామని తెలిపారు.
undefined
అయితే, ఏప్రిల్ నెలలోనూ ఈ రకంగా కొందరు కరోనా పాజిటివ్ రోగుల్లో రక్తం గడ్డకట్టిన దాఖలాలున్నాయని, కానీ, ఈ రోగి మాదిరిగా ప్రియాపిజమ్ లక్షణాలు లేవని తెలిపారు.
undefined
రక్తం గడ్డ కట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్తప్రసరణ సరిగా జరగదని, అటువంటి సందర్భంలో రోగిలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. కరోనా పాజిటివ్ రోగుల్లో ఈ స్థితి ఎందుకు వస్తుందన్న దానిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్పారు.
undefined
click me!