పెళ్లికి ముందే సహజీవనం.. యువతి ఏమంటున్నారంటే..

First Published | Jul 4, 2020, 3:07 PM IST

టీనేజ్ లో ప్రేమ అంటే.. కచ్చితంగా శృంగారంలో పాల్గొంటారనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే.. వారి ఆలోచనలకు ఈ తరం యువత పంటా పంచలు చేస్తోంది.
 

టీనేజ్ లో యువతీ యువకులకు ఆపోజిట్ జెండర్ పట్ల ఆకర్షణ ఉండటం సహజం. అది ప్రేమో, మోజో, వ్యామోహమో.. వాళ్లే ఓ పట్టాన తేల్చుకోలేరు. అలా అని ఇంట్లో పేరెంట్స్ కి చెప్పలేరు.
ఇంకొందరైతే.. కనీసం ఫ్రెండ్స్ కి కూడా పంచుకోలేరు. అలా ప్రేమలో పడి జీవితాలు నాశనం చేసుకున్న యువతీయువకులు చాలా మంది ఉన్నారు.

ఈ విషయం పక్కన పెడితే.. ప్రేమలో ఉన్నప్పుడు..తమ ఆపోజిట్ జెండర్ నుంచి టీనేజర్లు ఎక్కువగా ముద్దులు, కౌగిలింతలు మాత్రమే కోరుకుంటున్నారని ఓ తాజా సర్వేలో వెల్లడైంది.
టీనేజ్ లో ప్రేమ అంటే.. కచ్చితంగా శృంగారంలో పాల్గొంటారనే భావన చాలా మందిలో ఉంటుంది. అయితే.. వారి ఆలోచనలకు ఈ తరం యువత పంటా పంచలు చేస్తోంది.
ప్రేమలో ఉన్నప్పుడు కేవలం ముద్దు, కౌగిలింతలను మాత్రమే ఇష్టపడతామని కొందరు టీనేజీ యువతీయువకులు తెలిపారు. టీనేజీలో ముద్దులు, కౌగిలింతలు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఫ్రెండ్ షిప్, లివింగ్ ఇన్ రిలేషన్ షిప్, జోక్స్, సెక్స్, రొమాన్స్ తదితర అంశాల గురించి ఈ సర్వేలో ఆరా తీశారు.
సెక్స్ సంబంధాలకంటే కూడా ముద్దులు, కౌగిలింతలే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. ముఖ్యంగా అబ్బాయిలే.. సెక్స్ పరమైన సంబంధాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
అయితే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ(ఎన్ఎఫ్ హెచ్ఎస్).. చేసిన ఓ సర్వేలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శృంగారంలో తొలి అనుభవం కోసం ఈ కాలం యువత కాస్త ఎక్కువగా తొందరపడుతున్నట్లు తెలిసింది.
యువతరం తొలిసారిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారు అనే విషయం పై వారు జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతీయుల లైంగిక జీవితానికి సంబంధించిన అనేక కీలక విషయాల్ని ఈ సర్వే బయటపెట్టింది.
దాదాపు లక్షమంది పురుషులు, మరో లక్షమంది మహిళలపై కుటుంబ ఆరోగ్య సర్వే చేశారు. వయసుల మధ్య వ్యత్యాసాలు, పడక సుఖాల్ని పొందడంలో వివిధ గ్రూపుల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యాభ్యాసం వల్ల సెక్స్‌ను వాయిదావేసుకోవడం... ఇత్యాది విషయాల్ని సర్వే చర్చించింది.
ఈ సర్వే ప్రకారం.. అమ్మాయిలు 19 ఏళ్లలోపే లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నారని పేర్కొంది. పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి అనుభవాన్ని పొందుతున్నారని తెలిపింది.
అమ్మాయిలకు యుక్త వయసులో వివాహం అవుతుండటంతోనే వారు అబ్బాయిలతో పోలిస్తే తొందరగా తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఎన్ఎఫ్ హెచ్ఎస్ తెలిపింది.
ఓ సర్వేలో తేలిందేమిటంటే.. ప్రేమించిన వాళ్లని ఎంత మంది పెళ్లి చేసుకుంటారని సర్వే చేయగా.. 22.4శాతం అబ్బాయిలు ఎస్ చెప్పగా.. అమ్మాయిలు కేవలం 19శాతం ఒకే చెప్పారు.
మిగిలినవారంతా.. దాదాపు చేసుకోమని.. కొందరైతే... అసలు చేసుకునే ఛాన్సే లేదని చెప్పడం విశేషం.
ఒక పెద్దలు కుదర్చిన పెళ్లి.. లేదా ఫ్యామిలీలో తెలిసి వాళ్లని ఎంత మంది చేసుకుంటారంటే..74శాతం పురుషులు ఒకే చెప్పగా.. అమ్మాయిలు 72శాతం ఒకే చెప్పారు.
పెళ్లికి ముందు సెక్స్ పై నిషేధం ఉన్నప్పటికీ.. 24 ఏళ్లలోపు పురుషుల్లో 11 శాతం మంది, స్త్రీలలో 2 శాతం సెక్స్ లో పాల్గొన్నట్టు వెల్లడించారు.
ఈ వయసున్న గ్రూపులో పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న పురుషుల్లో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో 21.1% మంది, మధ్యప్రదేశ్‌లో 20.7% మంది ఉన్నారు.
ఇదే సందర్భంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో చురుకుగా లైంగిక జీవితాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.
హరియాణ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో సర్వేలో పాల్గొన్న దాదాపు 55 శాతం మంది చాన్నాళ్ల ముందు నుంచే తాము సెక్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలున్నాయి.

Latest Videos

click me!