జీవితంలో ప్రతి ఒక్కరూ తోడు కోరుకుంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత.. తమ జీవితంలోకి ఎవరైనా వస్తే బాగుంటుందని.. వారితో కలిసి జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటారు. అయితే.. ఈ రిలేషన్ లోకి వెళ్లిన తర్వాత.. ఒక్కోసారి గొడవలు జరగడం, వివాదాలు రావడం లాంటివి జరుగుతుంటాయి. అలా గొడవలు రాగానే.. కొందరు వాటిని పరిష్కరించుకొని మామూలు అయిపోవాలని అనుకుంటారు. కానీ కొందరు మాత్రం ఇక ఆ బంధానికి పులిస్టాప్ పెట్టేసి.. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. మీకు కూడా అలాంటి ఆలోచనలు వస్తున్నాయా..? దాని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం..
భార్యభర్తలు, ప్రేమికులు అన్నాక..గొడవలు రావడం చాలా సహజం. వాటిని పరిష్కరించుకోవాలని ప్రయత్నించాలే తప్ప.. విడిపోయి ఒంటరిగా ఉండాలని అనుకోకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే... అచ్చం ఇలాంటి ఆలోచనలు మీ పార్ట్ నర్ కి కూడా వస్తుందేమో కనుక్కునే ప్రయత్నం చేయాలి. ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడేందుకు ఏం చేయాలి అని ఆలోచించాలి.
అసలు.. అలా ఒంటరిగా ఉండాలనే ఆలోచన ఎందుకు వచ్చింది.. అనే విషయాన్ని ముందుగా ఆలోచించాలి. అసలు సమస్య ఎక్కడ వచ్చిందనే విషయాన్ని ఆలోచిస్తే... దానిని పరిష్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఎలా చేస్తే.. ఇద్దరి మధ్య సమస్యలు రాకుండా ఉంటాయా అనే విషయాన్ని ఇద్దరూ కూర్చొని చర్చించుకోవాలట. అప్పుడు.. మరోసారి అలాంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచిస్తే.. సమస్య నుంచి బయటపడతారట.
ఇక.. ఒంటరితనం ఆలోచనలు బయటపడాలంటే.. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. కొత్త అలవాట్లను ఏర్పాటుచేసుకోవడం, యోగా , వ్యాయామం వంటి వాటిపై ఫోకస్ పెట్టడం లాంటివి చేయాలి. అప్పుడు ఒంటరిగా ఉండాలనే ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ఇక.. ఒంటరితనం ఆలోచనలు బయటపడాలంటే.. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి. కొత్త అలవాట్లను ఏర్పాటుచేసుకోవడం, యోగా , వ్యాయామం వంటి వాటిపై ఫోకస్ పెట్టడం లాంటివి చేయాలి. అప్పుడు ఒంటరిగా ఉండాలనే ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
ఇక భార్యతో గొడవ జరిగితే... కొద్ది సేపు ఆమెతో మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. అలా అని ఒంటరిగా ఉండకూడదు. తల్లిదండ్రులు,స్నేహితులు, కుటుంబసభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల ఒంటరితనం ఆలోచనలు రాకుండా ఉంటాయి.
మీరు బాధపడ్డారని.. మీకు ఒంటరిగా ఉండాలనే ఆలోచనలు వస్తే.. దానిని మీ పార్ట్ నర్ వెంటనే అర్థం చేసుకోవాలని అనుకోకూడదట. వారికి కొంత సమయం ఇచ్చి... వారు మిమ్మల్ని అర్థం చేసుకునే సమయాన్ని ఇవ్వాలి.
మిమ్మల్ని మీరు ప్రేమించడం పై దృష్టిపెట్టాలి. అలా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం వల్ల.. ఒంటరిగా ఉంటూ.. తమను తాము బాధపెట్టుకోవాలని అనుకోరట. కాబట్టి.. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి.
మీ పార్ట్ నర్ పై నమ్మకం ఉంచుకోవాలట. వారు మిమ్మల్ని ప్రేమించడం లేదనే అనుమానాలు పెంచుకోకూడదట. వారు మిమ్మల్ని ప్రేమించినా.. మీలో అనుమానం ఉంటే.. వారి ప్రేమ కనపడదు. కాబట్టి.. ముందు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు.
అలా కాదు అంటే.. మీకు ఒంటరిగా ఉండాలనే ఆలోచనలు రాగానే.. ముందుగా మీ పార్ట్ నర్ తో మాట్లాడాలి. వారితో మాట్లాడి.. మీలోని ఫీలింగ్స్ ని వారితో పంచుకోవాలి. అప్పుడు.. అలాంటి ఆలోచనల నుంచి బయటపడే అవకాశం ఉంది.