ముద్దు పెట్టుకోవాలంటే.. ముందు ఈ విషయాలను మర్చిపోకూడదు.. లేదంటే మీ పని అంతే..!

First Published | Sep 3, 2023, 9:39 AM IST

ముద్దు ముచ్చటను ఇష్టపడనివారుండరు. కానీ చాలా మంది ముద్దు పెట్టుకునే సమయంలో చాలా రకాల తప్పులు చేస్తుంటారు. పర్ఫెక్ట్ ముద్దు కోసం కొన్ని చిట్కాలను తప్పకుండా పాటించాల్సిందేనంటున్నారు నిపుణులు. 

ముద్దు అనేది ప్రేమను వ్యక్తీకరించే ఒక మార్గం. ఇక భాగస్వాములను ఈ ముద్దు శృంగారం వరకు తీసుకెళుతుంది. ఏదేమైనా ముద్దు పెట్టుకున్న విధానం మర్చిపోలేని ఒక గొప్ప అనుభూతి. ఇది ఇద్దరి మధ్య ప్రేమను బలపరుస్తుంది. ప్రేమ విషయంలో ముద్దు పెట్టుకునే కళను నేర్చుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ ప్రయాణంలో గేమ్ ఛేంజర్ గా పనిచేసే కళ ఇది. అయితే చాలా మంది ముద్దు పెట్టుకునే సమయంలో చాలా రకాల తప్పులను చేస్తుంటారు. అంతేకాకుండా ముద్దు పెట్టుకునే ముందు నోటి పరిశుభ్రతను కూడా మర్చిపోతుంటారు. పర్ఫెక్ట్ కిస్ కోసం ఎలాంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సమ్మతి అవసరం

సినిమాల్లో తరచూ కనిపించే ముద్దు సీన్స్ ముద్దు పెట్టుకోవడానికి ప్రత్యేకమైన సమయం ఏదీ లేదంటూ సూచిస్తాయి. మీ భావాలను వ్యక్తీకరించడానికి మీరు ఎప్పుడైనా ముద్దు పెట్టుకోవచ్చు. మీరు మీ భాగస్వామితో డేటింగ్ కోసం బయటకు వెళుతున్నప్పుడు ముద్దుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆకస్మిక ముద్దు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆనందంతో నింపుతుంది. అయితే అంతకంటే ముందు భాగస్వామితో కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది శృంగార భావాల్ని పెంచడమే కాకుండా మీ గౌరవాన్ని కాపాడుతుంది.
 


ఘర్షణలను నివారించండి

ముద్దు పెట్టుకునేటప్పుడు చాలాసార్లు ముక్కు లేదా నుదిరు ఒకదానికొకటి ఢీకొడతాయి. ఇవి మన జీవితాంతం గుర్తుంచుకునే ఆనందమైన, నవ్వు క్షణాలు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే భాగస్వామి బుగ్గలపై ముద్దు పెట్టి సున్నితంగా ముందుకు సాగాలి. ఇలా రెండు వైపులా ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది.
 

కంటి సంబంధాన్ని కొనసాగించండి

లిప్ టు లిప్ కిస్ చేసేటప్పుడు చాలా మంది కళ్లు మూసుకుంటుంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవాలి.  దీనివల్ల మీ ప్రేమ పెరుగుతుంది. అలాగే మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే ఒకరికొకరు దగ్గరవుతారు. 
 

తొందరపాటును నివారించండి

ప్రేమ పట్ల వ్యామోహంలో తొందరపాటు సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మీ ముద్దు మృదువుగా, నెమ్మదిగా సాగనివ్వండి. దీంతో మీరు రిలాక్స్ గా, మెరుగ్గా అనుభూతి చెందుతారు. ఇది ఇద్దరిలో ఆనందాన్ని కలిగిస్తుంది.

Image: Getty Images

ఎక్కువసేపు ముద్దు పెట్టుకోండి

ఈ క్షణాలను ఆస్వాదించడానికి, ముద్దును మరింత ఎక్కువ సేపు పెట్టుకోవడానికి నెమ్మదిగా ముందుకు కదలండి. అలాగే ముద్దును అనుభూతి చెందండి. ఈ అనుభవాన్ని ఆస్వాదించడానికి మీరు నెమ్మదిగా ముందుకు సాగాలి. ఆ క్షణాలను ఆస్వాధించండి. చివరగా ఫ్రెంచ్ ముద్దు పెట్టి మీ భాగస్వామిని సంతృప్తిపరచండి. 

నోటి పరిశుభ్రతపై శ్రద్ధ వహించండి

ముద్దు పెట్టుకునేటప్పుడు నోటి పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా నోటి నుంచి దుర్వాసన రాకుండా చూసుకోవాలి. ముద్దు పెట్టుకోవడానికి ముందు బ్రష్, నోటి శుభ్రత వంటి చిట్కాలను పాటించాలి. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా తొలగిస్తుంది.

ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను 

ఒత్తిడిని తగ్గించండి

ఒత్తిడిని తగ్గించడంలో ముద్దు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఆక్సిటోసిన్, డోపామైన్, సెరోటోనిన్ వంటి సంతోషకరమైన హార్మోన్ల విడుదలవుతాయి. ఇది మీ మనస్సును రిలాక్స్ చేస్తుంది. సంతోషంగా అనిపిస్తుంది. ఏదో ఒక విషయంలో ఆందోళన నుంచి ఉపశమనం పొందాలంటే మీ భాగస్వామిని ముద్దు పెట్టుకోండి. 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ముద్దు పెట్టుకునేటప్పుడు నోటిలో లాలాజలం మార్పిడి అవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. లాలాజలంతో పాటు మైక్రోబయోటాను పంచుకోవడం కూడా నోటి పరిశుభ్రతను నిర్వహిస్తుంది. ఇది మిమ్మల్ని అనేక రకాల అంటువ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.

లైంగిక సంతృప్తిని పెంచుతుంది

సెక్స్ సమయంలో ఉద్వేగభరితమైన ముద్దు మీ శరీరంలో లైంగిక సంతృప్తిని పెంచుతుంది. ఇది ఉద్వేగం గరిష్ట స్థాయికి దారితీయడమే కాకుండా భాగస్వాములను ప్రేరేపించడానికి కూడా కారణమవుతుంది. ఇది లైంగిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే మీ ప్రేమను బలపరుస్తుంది.
 

కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది

అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ముద్దు ద్వారా మీరు కేలరీలను సులభంగా బర్న్ చేస్తారు. సింపుల్ గా కిస్ చేస్తే 2 నుంచి 3 క్యాలరీలు బర్న్ అవుతాయి. అలాగే ఉద్వేగభరితమైన ముద్దు 5 నుంచి 26 కేలరీల వరకు బర్న్ చేస్తుంది. 
 

Latest Videos

click me!