valentine week 2024: ఈ వారంలో కిస్ డే, హగ్ డే, రోజ్ డే, టెడ్డీ లు ఎప్పుడెప్పుడంటే?

First Published | Feb 3, 2024, 11:55 AM IST

valentine week 2024: ఫిబ్రవరి నెల ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైన నెల. ఎందుకంటే ఈ నెలలోనే ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక ప్రేమికుల రోజును వారం రోజుల పాటు జరుపుకుంటారు. 7 రోజుల  పాటు జరుపుకునే వాలెంటైన్ వీక్ లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఫిబ్రవరి.. సంవత్సరంలో అతి తక్కువ రోజులున్న నెల అయినప్పటికీ.. ఈ నెల కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. ఎందుకనుకుంటారేమో.. ఈ నెలలోనే కదా ప్రేమికులకు  ఇష్టమైన వాలెంటెన్ డే వచ్చేది. ఈ రోజు ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తే.. సింగిల్ గా ఉన్నవారు నచ్చిన వాళ్లకు ప్రపొజ్ చేస్తుంటారు. అయితే వాలెంటైన్స్ డేకు ముందు వాలెంటైన్ వీక్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వాలెంటైన్ వీక్ లో ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది.  అందుకే ఈ వాలెంటైన్స్ వీక్ లో వచ్చే రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఫిబ్రవరి 7 - రోజ్ డే

వాలెంటైన్స్ వీక్ లో మొదటి రోజు రోజ్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు ప్రియమైన వారికి గులాబీ పువ్వులను బహుమతిగా ఇస్తారు. నిజానికి ఒక్కో రంగు గులాబీకి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. అంటే  ఎర్రని గులాబీ ప్రేమకు చిహ్నమైతే.. పసుపు స్నేహానికి, ప్రశంసకు, తెలుపు శాంతికి చిహ్నాలు. ఈ రోజున నచ్చిన వారికి గులాబీ పువ్వులు ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. ప్రేమ, అభిరుచికి చిహ్నంగా విక్టోరియన్లు తమ ప్రియమైన వారికి గులాబీ పువ్వులను బహుమతిగా ఇవ్వడంతో ఇది ప్రారంభమైంది. అందుకే ఈ రోజు మీరు ఒక పువ్వును మీకు నచ్చిన వారికి ఇవ్వొచ్చు. 
 


Image: Freepik

ఫిబ్రవరి 8 - ప్రపోజ్ డే

వాలెంటైన్స్ వీక్ లో రెండో రోజు ప్రపోజ్ డే ను జరుపుకుంటారు. ప్రేమలో ఉన్న వారు ఈ రోజున ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. చేయి చాచి.. జీవితాంతం తమ భాగస్వామిగా ఉండమని అడుగుతారు. ప్రపోజ్ చేయడమనేది రిలేషన్ షిప్ లో ఒక ముఖ్యమైన దశ. ఇది ఒకరి పట్ల మరొకరికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఆస్ట్రియన్ ఆర్చ్ డ్యూక్ మాక్సిమిలియన్ 1477 లో ఈ రోజున బుర్గుండి మేరీకి ప్రపోజ్ చేశాడని చాలా మంది నమ్ముతారు.

ఫిబ్రవరి 9 - చాక్లెట్ డే

వాలెంటైన్స్ వీక్ లో మూడవ రోజును చాక్లెట్ డేగా జరుపుకుంటారు. ఇది ఫిబ్రవరి 9 న వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, ఆనందాన్ని కలిగించే అత్యంత ఇష్టపడే డెజర్ట్ లో చాక్లెట్ ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని వ్యక్తీకరించడానికి ఒకరికొకరు చాక్లెట్ ను ఇచ్చిపుచ్చుకుంటారు.
 

ఫిబ్రవరి 10 - టెడ్డీ డే

ఫిబ్రవరి 10 న టెడ్డీ డే ను జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఒకరికొకరు టెడ్డీబేర్లను గిఫ్ట్ గా ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. టెడ్డీ బేర్ లను ప్రేమ, అభిమానం, సంరక్షణకు చిహ్నంగా భావిస్తారు.
 

ఫిబ్రవరి 11 - ప్రామిస్ డే

ఫిబ్రవరి 11 న ప్రామిస్ డే ను జరుపుకుంటారు. తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒకరి పట్ల ఒకరు తమ నిబద్ధతను చూపడానికి ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజున జంటలు తమ సంబంధంలో నిబద్ధత, నమ్మకంగా ఉండటానికి ఒకరికొకరు వాగ్దానాలు చేస్తారు.
 

ఫిబ్రవరి 12 - హగ్ డే

ఫిబ్రవరి 12న హగ్ డే ను జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు తమ ప్రియురాలిని తమ వెచ్చని కౌగిలిలో బంధిస్తారు. కౌగిలితో వారిపై తమకున్న ప్రేమను గుర్తు చేసుకుంటారు.
 

ఫిబ్రవరి 13 - కిస్ డే

వాలెంటైన్స్ డేకు ఒక రోజు ముందు అంటే ఫిబ్రవరి 13న కిస్ డే వస్తుంది. ముద్దు అనేది ప్రేమకు శారీరక వ్యక్తీకరణ. ఇది అంతులేని ప్రేమ, ఆప్యాయతను సూచిస్తుంది.
 

ఫిబ్రవరి 14 - ప్రేమికుల రోజు

సెయింట్ వాలెంటైన్ గా ఉన్న ప్రారంభ క్రైస్తవ అమరవీరుల జ్ఞాపకార్థం వాలెంటైన్స్ డే ను జరుపుకుంటారు. ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు, ఈ రోజున జంటలు తమ భాగస్వామిని ప్రత్యేకంగా  చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజుకు టోన్ సెట్ చేయడానికి వారమంతా జరుపుకున్నారు.

Latest Videos

click me!