కోపంతో శృంగారంలో పాల్గొంటే ఏమౌతుందో తెలుసా?

కోపంతో కూడిన సెక్స్ ఉత్తేజకరంగా అనిపించొచ్చు. కానీ ఇది మీ సెక్స్ డ్రైవ్ కు అస్సలు మంచిది కాదు. అసలు సెక్స్ డ్రైవ్ కు, కోపానికి సంబంధం ఏంటో తెలుసుకుందాం పదండి.. 
 

కోపంతో కూడిన సెక్స్ మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇలాంటి లైంగిక కార్యకలాపాలు ఉత్తేజంగా ఉంటాయి. కొంతమంది తమ భాగస్వాములతో నిరాశ లేదా అపార్థాలను పరిష్కరించడానికి శారీరక మార్గంగా దీనిని ఉపయోగిస్తారు. ఇది జంటల మధ్య  సంబంధాల విభేదాలను పరిష్కరించడానికి, అసమ్మతి లేదా గొడవ తర్వాత ఒకరితో ఒకరు తిరిగి కనెక్ట్ కావడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు కోపంతో కూడిన సెక్స్ పని ఒత్తిడి లేదా ప్రతికూల భావాల నుంచి తప్పించుకునే మార్గంగా ఉపయోగించబడుతుంది. కానీ ఇది ఆరోగ్యంగా ఉండకపోవచ్చు. నిపుణుల ప్రకారం.. కోపం సెక్స్ డ్రైవ్ ను కూడా ప్రభావితం చేస్తుంది. కోపం, సెక్స్ డ్రైవ్ మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కోపం మహిళల్లో సెక్స్ డ్రైవ్ ను ఎలా ప్రభావితం చేస్తుంది?

కోపం సాధారణంగా గొడవలు, వాదనలు లేదా నిరాశ వల్ల వస్తుంది. కోపం వల్ల కరుణ లేదా ప్రేమ భావన ఉండదు. ఈ సమయంలో కానీ ఒక రకమైన ఆందోళన, కోపం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ భావోద్వేగాలు సహజమైనే. అయినప్పటికీ అవి ఒక వ్యక్తి దృష్టిని మార్చగలకు. అలాగే సెక్స్ పట్ల తక్కువ ఆసక్తి ఉంటుంది. ఇది మహిళల్లో లిబిడో తగ్గడానికి కారణమవుతుంది. ఆర్కైవ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్ లో ప్రచురించబడిన 1995 అధ్యయనం ప్రకారం..  కోపం, ఆందోళన మహిళల్లో లైంగిక కోరికను బాగా తగ్గించాయి.


కోపంతో శృంగారంలో ఎందుకు పాల్గొంటారు?

కొంతమంది కోపంగా ఉన్నప్పుడు వారి భాగస్వామితో కమ్యూనికేట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు కోపం ఆధారిత లైంగిక చర్యలలో పాల్గొంటారు. లైంగిక కార్యకలాపాల సమయంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదల అయ్యి కోపం తగ్గుతుంది. కానీ దీనిలో కోపం దూకుడు హింసాత్మక లైంగిక చర్యగా అనువదించబడుతుంది. లైంగిక చర్య తర్వాత సంఘర్షణ పరిష్కరించబడినప్పుడు లేదా కోపం తగ్గిన సందర్భాల్లో.. ఇది దంపతుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
 

Sleep after sex

కోపంతో కూడిన సెక్స్ లాభనష్టాలు ఏమిటి?

కోపంతో కూడిన సెక్స్ వల్ల వచ్చే సమస్యలు

ఇది పల్స్, రక్తపోటుతో పాటుగా ఇతర సమస్యలను పెంచుతుంది. కొన్నిసార్లు ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది.

బలవంతంగా సెక్స్  లో పాల్గొంటే సంబంధం దెబ్బతింటుంది. 

ఇది కొన్నిసార్లు లైంగిక కార్యకలాపాలను అర్థం చేసుకునే సరిహద్దులను దాటొచ్చు. ఇది చాలా శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది.

కోపాన్ని తగ్గించడానికి ఒక మాధ్యమంగా సెక్స్ ను ఉపయోగిస్తే.. ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. 

ఇది స్త్రీల సెక్స్ డ్రైవ్ ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

Food helps for sex

కోపంతో కూడిన సెక్స్ వల్ల లాభాలు

ఇది దంపతుల మధ్య బంధాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే ఇది వాదనలు, కొట్లాటలు పెరగకుండా నిరోధిస్తుంది. 

ఎలాంటి బలాన్ని ఉపయోగించకపోతే ఇది కరుణ, బంధాన్ని కూడా మెరుగుపరుస్తుంది.  

జంటలు మంచంపై అనుభవించే శారీరక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది.
 

Latest Videos

click me!