అలాంటి వ్యక్తితో కలిసి ఉండటం కష్టమే..!

First Published | Jul 12, 2021, 10:33 AM IST

ఒకరికి మరొకరు గౌరవం ఇస్తూ.. ఒకరి అభిప్రాయలకు మరొకరు వాల్యూ ఇవ్వడాన్ని హెల్దీ రిలేషన్ అంటారు. అలా లేకుండా.. ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉండటాన్ని అన్ హెల్దీ రిలేషన్ అంటారు.
 

మన జీవితంలో అన్ని బంధాలు ముఖ్యమే. ప్రతి ఒక్కరితోనూ మంచి సంబంధాలు కొనసాగి ఉండాలి. అయితే.. అన్నింటికన్నా.. భార్యభర్తల బంధం చాలా ముఖ్యమైనది. ఎవరితోనైనా ఎలాంటి సంబంధం లేకుండా అయినా ఉండటం సాధ్యమౌతుందేమో కానీ.. భార్యభర్తలు మాత్రం జీవితాంతం కలిసి ఉండాలి. మరి అలాంటి మీ మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది..? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా..?
అవును.. మీ పార్ట్ నర్ తో మీది హెల్దీ రిలేషనా లేక.. అన్ హెల్దీ రిలేషనా..? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ క్లారిటీ తెచ్చుకోవాలట. ఇది ఎలా తెలుస్తుంది అంటే.. మీరు.. వారితో.. వారు.. మీతో ఉన్న విధానాన్ని బట్టి ఆ విషయం తెలుస్తుందట. ఒకరికి మరొకరు గౌరవం ఇస్తూ.. ఒకరి అభిప్రాయలకు మరొకరు వాల్యూ ఇవ్వడాన్ని హెల్దీ రిలేషన్ అంటారు. అలా లేకుండా.. ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉండటాన్ని అన్ హెల్దీ రిలేషన్ అంటారు.

అయితే.. అన్ హెల్దీ రిలేషన్స్ ని కూడా కొంత వరకు భరించవచ్చు. కానీ.. కొన్నింటిని మాత్రం అస్సలు భరించకూడదట. ఎలా ప్రవర్తించే వ్యక్తిని మన జీవితం నుంచి దూరం చేసుకోవాలో.. ఈ అన్ హెల్దీ రిలేషన్ గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
ఎలాంటి బంధంలోనైనా ఎదుటి మనిషి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలా కాకుండా.. ప్రతిసారీ.. మీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు అంటే.. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
అసూయ.. ఇది కొంత వరకు ముద్దుగానే ఉంటుంది. కానీ ప్రతి విషయంలోనూ అసూయ పడుతూ.. ఆ ప్రవర్తనతో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే.. అలాంటివారిని భరించడం కూడా కష్టమే.
ఏ రిలేషన్ లో అయినా.. ముఖ్యంగా దంపతుల మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరం. ఏ విషయంలోనైనా.. ఎలాంటి సందర్భంలోనైనా.. తాము ఏమనుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పగలిగే స్వతంత్రం ఉండాలట. ప్రతి విషయాన్ని పంచుకోలేని దంపతులు అన్ హెల్దీ రిలేషన్ లో ఉన్నామనే విషయాన్ని గుర్తించాలట.
మీ పార్ట్ నర్.. మీ మీద డిపెండ్ అయితే తప్పు లేదు. అయితే.. బలవంతంగా.. తనకు కనీసం ఎలాంటి స్వేచ్ఛ, పర్సనల్ స్పేస్ అనేది లేకుండా.. బలవంతంగా డిపెండెంట్ గా చేయడం కూడా కరెక్ట్ కాదట. అలా చేసేవారికి దూరంగా ఉండటమే మంచిది.
ప్రతి విషయంలో క్రిటిసైజ్ చేయడం.. మంచి చేసినా.. కూడా విమర్శించేవారితో ఉండటం కూడా చాలా కష్టమట. అలాంటి వారితో జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మీ ఉద్యోగం మీద, మీ శరీరం పై జోక్స్ వేసే వారిని కూడా తట్టుకోవడం కష్టం.

Latest Videos

click me!