మనం ప్రేమించిన వ్యక్తి మన జీవితంలోకి వస్తే.. ఆ లైఫ్ చాలా అందంగా ఉంటుంది. నచ్చిన వ్యక్తిని ప్రేమించడం సులభమే. కానీ.. ఆ వ్యక్తి మన జీవితంలోకి వచ్చి.. జీవితాంతం మనతో ఉండాలి అంటే అంత అదృష్టం అందరికీ దక్కదు. అయితే.. మన ప్రేమ జీవితం కూడా ఇంటి వాస్తుపై ఆధారపడి ఉంటుందని జోతిష్యశాస్త్రం చెబుతోంది.
నమ్మసక్యంగా లేకపోయినా.. మనం కొన్ని వాస్తుమార్పులు చేసుకుంటే.. మీరు నచ్చిన, ప్రేమించిన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మరి ఆ మార్పులేంటో చూద్దామా..
1. మీరు ప్రేమించిన వాళ్లు.. మీ వైపు ఆకర్షితులు అవ్వాలంటే.. మీ ఇంట్లోని నైరుతి ప్రాంతంలో.. లవ్ బర్డ్స్ పెయింట్ పెట్టుకోవాలి.
2. మీ ఇంట్లో సౌత్ ఫేసింగ్ గోడలు నీలి రంగులో ఉంటే.. అతర్జెంట్ గా.. ఆ గోడ రంగుని మార్చేయాలి. ప్రేమకు నీలి రంగు అస్సలు సెట్ అవ్వదు.. ఆ రెండింటికి అస్సలు మ్యాచ్ అవ్వదు. దాని ప్రభావం మీ ప్రేమపై పడే అవకాశం ఉంది.
3. మీరు మీ ఇంటిని మారడం.. లేదా పునర్నిర్మాణం లాంటివి చేస్తుంటే.. మీ ఇంట్లోని తూర్పు లేదా.. దక్షిణ మూలలోని గదిలో పడుకోకూడదు. ఈ విషయం మర్చిపోకండి.
4.ఎరుపు రంగు ప్రేమకు గుర్తు. కాబట్టి.. ఈ రంగు ప్రతి విషయంలో రెఫ్లెక్ట్ అయ్యేలా చూసుకోవాలి. ఫోన్ కేస్ రెడ్ కలర్, డ్రెస్ రెడ్ కలర్ అలా చూసుకోవాలి.
5. మీ ఇంటికి, ముఖ్యంగా బాత్రూమ్ , బెడ్ రూమ్ కోసం తెలుపు ,పింక్,పసుపు షేడ్స్ ఎంచుకోండి.
6. ఉపయోగించని లేదా పాత వస్తువులను సేకరించండం లాంటివి చేయకూడదు. భవిష్యత్తులో మీకు అవసరం లేని అన్ని విషయాలను తొలగించండి. అవసరమైనవారికి దానం చేయండి
8. మీ కుటుంబ ఛాయాచిత్రాలు ,మీ ప్రియమైనవారి ఫోటోలు ఎల్లప్పుడూ దుమ్ము లేకుండా.. శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
9. నిద్రపోతున్నప్పుడు, మీ తల దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి.