పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది. పెళ్లి తర్వాత.. జీవితంలో అప్పటి లా ఉండదు. బరువు, బాధ్యతలు పెరిగిపోతాయి. పెళ్లి తర్వాత జీవితం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. కచ్చితంగా ఆనందంగా ఉంటుందని ఎవరూ ఎవరికీ గ్యారెంటీ ఇవ్వలేరు.
undefined
అందుకే.. ఏ విషయంలోనైనా వెంటనే నిర్ణయాలు తీసుకునేవారు కూడా.. పెళ్లి అనగానే భయపడిపోతుంటారు. . అసలు.. పెళ్లికి సరైన ఏజ్ ఏంటి..? ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
undefined
బ్యాచిలర్ లైఫ్ ని అప్పటి వరకు బాగా ఎంజాయ్ చేసినవారైనా ఎప్పుడోకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే. అయితే.. దానికన్నా ముందు వారిలో ఓ స్టెబిలిటీ ఉండాలి. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తితో ఆనందంగా ఉండగలము అనే నమ్మకం కూడా ఉండాలి. అలాంటప్పుడే ఆ వైపు అడుగు వేయాలి. అంతేకాదు.. ఎలాంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేయగలమనే ధైర్యం ఉండాలి.
undefined
కొందరు.. తాము చాలా సంతోషంగా ఉన్నామని.. ఇక జీవితంలో పెళ్లి ఒక్కటే మిగిలిందని.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే.. అది కరెక్ట్ కాదట.. మీకు నచ్చిన లైఫ్.. మీ జీవితంలోకి వచ్చే వారికి కూడా నచ్చాలని గ్యారెంటీ ఏమీ లేదు కదా..? నిజంగా వారికి కూడా మీకు నచ్చిన లైఫ్ నచ్చితే.. అప్పుడే పెళ్లి బంధంలోకి నిస్సందేహంగా అడుగుపెట్టొచ్చట.
undefined
పెళ్లికి సిద్ధంగా ఉన్నారంటే.. ఏ విషయాన్నైనా తట్టుకునే విధంగా ఉండాలట. అంటే.. ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలట. మీ లైఫ్ లోకి వచ్చేవారికి గతంలో ఎవైనా లవ్ ఎఫైర్ ఉండి ఉండొచ్చు. అలాంటివి తెలిసినా.. వాటిని తట్టుకొని నిలబడే ధైర్యం ఉండాలి.
undefined
ఇక ముఖ్యంగా.. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారంటే. మీకు ఆర్థికంగా నిలదొక్కుకొని ఉండాలి. అలా కాకుండా.. కొత్త బంధంలోకి అడుగుపెడితే.. ఆర్థిక సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దానికన్నా ముందే.. ఆర్థికంగా నిలపడితే... ఎలాంటి సమస్యలు ఉండవు. సంపాదించిన దానిని దాచిపెట్టే సామర్థ్యం కూడా ఉండాలి. ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యం.
undefined
ఇక పెళ్లి చేసుకున్న తర్వాత.. భార్య కచ్చితంగా భర్త పై ఆధారపడి ఉండాలి. చెప్పిన మాట వినాలి లాంటి పాత కాలం రూల్స్ పెట్టుకోకుండా ఉండటమే మంచిది. ఇద్దరూ ఒకరికి మరొకరు గౌరవం ఇస్తూ జీవితం గడపాలి. డబ్బు సంపాదించే విషయం నుంచి.. ఖర్చు పెట్టేవరకు ప్రతీదీ.. ఇద్దరూ బాధ్యతగా వ్యవహరించాలి. ఇద్దరికీ బాధ్యత ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి.
undefined
ఇక చాలా మంది అబ్బాయిలు.. తమ పెళ్లైన స్నేహితులను చూసి.. వారు చెప్పే మాటలు విని.. పెళ్లంటే భయపడుతూ.. పెళ్లామంటే.. రాక్షసి లా ఫీలౌతుంటారు. ముందు ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి.
undefined