సాధారణంగా అమ్మాయిలలో చిన్న చిన్న లోపాలు ఉన్నా అబ్బాయిలు పెద్దగా పట్టించుకోరు కానీ ఆడపిల్లలలో ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా అబ్బాయిలు వాళ్లని దూరం పెడతారు. సాధారణంగా ఆడపిల్లలు తమ తండ్రితో భర్తను గాని బాయ్ ఫ్రెండ్ అని పోలుస్తూ ఉంటారు.
ప్రతి విషయాన్ని తండ్రి బిహేవియర్ తో కంపేర్ చేస్తూ ఉంటారు. అది మగవాళ్ళకి అస్సలు నచ్చని విషయం. ఎవరికి ఉండే స్వభావం వాళ్ళకి ఉంటుంది అనేది మగవాళ్ళ ఉద్దేశం. అలాగే అసూయపడే ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు దగ్గరికి కూడా రానివ్వరు.
అసూయతో నిండిన ఆడదాని ప్రవర్తన ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళలో ఉండే డామినేటింగ్ స్వభావం కూడా మగవాళ్ళకి నచ్చదు. తమకి గౌరవాన్ని ఇచ్చి, తమ అభిప్రాయానికి విలువ ఇచ్చే ఆడవాళ్ళని మగవాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు.
అలా కాకుండా నీకు జీతం తక్కువని లేదంటే మరొక వంకతోనో మగవాళ్ళని చులకనగా చూసే ఆడవాళ్ళని మగవాళ్ళు అస్సలు ఇష్టపడరు. అలాగే ఆడవాళ్ళలో ఉండే నిజాయితీ కూడా మగవాళ్ళకి ఎంతో ఇష్టం. నిజాయితీ లేని ఆడవాళ్ళని బాధ్యతలేని ఆడవాళ్ళని మగవాళ్ళు అస్సలు ఇష్టపడరు.
కొందరు అతితెలివి గల ఆడవాళ్లు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. వాళ్లకి అవసరం ఉన్నప్పుడు మగవాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ అవసరం తీరిన తర్వాత కనీసం వాళ్ళ మొహం చూడటానికి కూడా ఇష్టపడరు. అలాంటి ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు ఇష్టపడరు.
అలాగే తనకంటూ పర్సనల్ స్పేస్ లేకుండా నువ్వంటే నాకిష్టం అంటూ నిత్యం తనతోనే ఉండమనే ఆడవాళ్ళని కూడా మగవాళ్ళు భరించలేరు. ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నప్పటికీ ఎవరికి ఉండవలసిన స్పేస్ వాళ్ళకి ఉండే తీరాలి. కాబట్టి ఆడపిల్లలు.. మీలో మీ లక్షణాలు ఉంటే కచ్చితంగా మార్చుకోండి లేదంటే అబ్బాయిలు దూరం పెట్టేస్తారు జాగ్రత్త