దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలంటే... ఇవి తప్పనిసరి...!

First Published | Aug 30, 2022, 1:20 PM IST

అందుకోసం ఏం చేయాలి..? ఏం చేయకూడదు అనే విషయాలు చాలా మందికి తెలీదు. దంపతులు తమ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడానికి కొన్ని అలవాట్లను అలవాటు చేసుకోవాలట. అవేంటో ఓసారి చూద్దాం...


దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే... అందుకోసం ఏం చేయాలి..? ఏం చేయకూడదు అనే విషయాలు చాలా మందికి తెలీదు. దంపతులు తమ జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవడానికి కొన్ని అలవాట్లను అలవాటు చేసుకోవాలట. అవేంటో ఓసారి చూద్దాం...

1.ఇంటి పనులను దంపతులు ఇద్దరూ కలిసి పంచుకోవాలి. నువ్వే చేయాలి.. నేనే చేయాలి అనే పంతాలు లాంటివి పెట్టుకోకుండా... ఇద్దరూ కలిసి పనులు పంచుకోవాలి. కలిసి పని చేయాలి.

Latest Videos


2.దాంపత్య జీవితాన్ని ఆనందంగా జీవించాలి అనుకునేవారు తమ జీవిత భాగస్వామితో ప్రతి విషయాన్ని పంచుకుంటారు. తమ ఫీలింగ్స్, ఆలోచనలు ఇలా ప్రతి విషయాన్ని పంచుకుంటారు.

3.దంపతులు నిజాయితీతో ఉండాలి. నిజాయితీగా... నిజాలు పంచుకునే ధైర్యం ఉన్న దంపతులు జీవితంలో సంతోషంగా ఉటారట. అది ఎంత బాధపెట్టే విషయం అయినా.. నిజాయితీగా పంచుకోగల ధైర్యం ఉండాలట. అలాంటివారే సంతోషంగా ఉంటారు.

4.ప్రతి ఒక్కరూ తమ జీవిత భాగస్వామి విషయంలో కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే... ఒకరిపై మరొకరు ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఒకరి కోసం మరొకరు అనేలా ఉండాలట. అలాంటి దంపతులు ఆనందంగా ఉంటారట.

5.ఇక.. దంపతులు ఆనందంగా ఉండాలి అంటే ఒకరిపై మరొకరికి గౌరవం ఉండాలి. ఒకరికి మరొకరు మర్యాద ఇచ్చినప్పుడే వారు ఆనందంగా ఉంటారట.

6.దంపతులు ఆనందంగా ఉండాలి అంటే... మనస్పర్థలు, విభేదాలు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అందుకోసం ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి.  ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోన్లు లాంటివాటిని దూరంగా పెట్టడం చాలా అవసరం.

7. ఇక దంపతులు అన్నాక ఏదో ఒక విషయంలో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు బాధపడొచ్చు. అలాంటి సమయంలో ఈగో పెంచుకోకుండా... క్షమాపణ చెప్పి.. సమస్యను పరిష్కరించాలి.

8. ఆనందంగా ఉండాలి అనుకునే దంపతులు.. తమ సెక్స్ జీవితంలోనూ అస్సలు అశ్రద్ధ చూపించకూడదు. ఆ విషయంలోనూ ఒకరినొకరు దూరం పెట్టడం లాంటివి చేయకూడదు.
 

click me!