ఈ యోగాసనాలు.. సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి...!

First Published | Aug 29, 2022, 3:22 PM IST

పెరిగిన ఒత్తిడి మీ లైంగిక కోరికను తగ్గిస్తుంది. కాబట్టి... యోగా మీ ఒత్తిడి సమస్యలను తగ్గిస్తుంది. తద్వారా కలయికను పూర్తిగా ఆస్వాదించవచ్చు.ఆ ఆసానాలేంటో ఓసారి చూద్దాం...
 

Yoga Health-Do this asana to get a mood boost

యోగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికీ.. మనస్సు సంతోషంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ యోగాసనాలు వేయాలి.  అయితే... ఈ యోగాసనాలు... సెక్స్ లోనూ మన సామర్థ్యాన్ని పెంచడానికి సహాయం చేస్తాయనే విషయం మీకు తెలుసా..? నమ్మసక్యం కాకపోయినా ఇది నిజం. మరి ఎలాంటి యోగాసనాలు వేయడం వల్ల.. సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చో ఓసారి చూద్దాం....
 

క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా శరీరంలో ఒత్తిడి స్థాయిలను తగ్గించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. పెరిగిన ఒత్తిడి మీ లైంగిక కోరికను తగ్గిస్తుంది. కాబట్టి... యోగా మీ ఒత్తిడి సమస్యలను తగ్గిస్తుంది. తద్వారా కలయికను పూర్తిగా ఆస్వాదించవచ్చు.ఆ ఆసానాలేంటో ఓసారి చూద్దాం...


Internation Yoga Day 2022 - Kapalbhati

1.కపాల్ బాతీ..

కపాల్ బాతీ.. ఇదో శ్వాస ద్వారా చేసే యోగాసనం. ఇది.. మనుషుల్లో సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది. 2019లో చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇది పురుషులు, స్త్రీలు.. ఇద్దరూ లైంగిక ఆనందాన్ని పొందడానికి సహాయపడుతుంది.
మీ కళ్ళు మూసుకుని నిటారుగా కూర్చుని, మీ కడుపుని లోపలికి లాగుతూ మీ నాసికా రంధ్రాల ద్వారా బలవంతంగా ఊపిరి పీల్చుకోండి. పీల్చడం స్వయంచాలకంగా జరుగుతుంది. ఉచ్ఛ్వాసాలపై దృష్టి పెట్టండి. మీరు ఒక రౌండ్ 10 ఉచ్ఛ్వాసాలతో ప్రారంభించవచ్చు మరియు మీ సామర్థ్యం పెరిగేకొద్దీ నిశ్వాసల సంఖ్యను అలాగే రౌండ్ల సంఖ్యను నెమ్మదిగా పెంచవచ్చు.


2.బ్రిడ్జ్ పోస్..
ఈ ఆసనం మంచి సెక్స్‌కు ఉపయోగపడే మీ కటి కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ముందుగా.. నిటారుగా పడుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడత పెట్టాలి. ఆ తర్వాత.. ఆ రెండు కాళ్ల పాదాలను నేలపై అదిమిపెట్టి.. నడుము భాగాన్ని పైకి ఎత్తాలి. ఈ సమయంలో తలను నేల మీద మాత్రమే ఉంచాలి. ఇలా పలుమార్లు రిపీట్ చేయాలి.
 

హ్యాపీ బేబీ...

ఈ యోగాసనం కూడా సెక్స్ ని ఆస్వాదించడానికి సహాయపడుతుంది. విభిన్న పోజులలో కలయికను ఆస్వాదించాలి అనుకునేవారికి ఇది బాగా సహాయపడుతుంది.
మొదట, మీ వెనుకభాగంలో పడుకోండి. ఇప్పుడు, మీ మోకాళ్లను మీ కడుపు వైపుకు వంచండి. ఇప్పుడు మీ చేతులతో మీ కాలి వేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ మోకాళ్లను వెడల్పు చేస్తూ మీ పాదాలను వేరుగా లాగండి. మీరు సాగదీయడానికి మీ చేతులతో క్రిందికి లాగినప్పుడు మీ మడమలను పైకి నెట్టండి.
 

5.శవాసన...
శవాసన కూడా యోగాను పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి సహాయపడుతుంది.  ఇది చూడటానికి నిద్రపోతున్నట్లుగానే ఉంటుంది. కానీ.. దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ యోగాసనం మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సహాయ పడుతుంది. సెక్స్ సమయంలోనూ ఎక్కువ ఆనందాన్ని పొందడానికి సహాయం చేస్తుంది.

Latest Videos

click me!