Image: Getty Images
పెళ్లికి ముందు.. పెళ్లైన కొత్తలో దంపతుల మధ్య విపరీతమైన ప్రేమ ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఆ ప్రేమ, ఆసక్తి తగ్గుతూ వస్తూ ఉంటాయి. దాదాపు అందరూ... పురుషులకు మాత్రమే తమ భార్య పట్ల ఆసక్తి తగ్గుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ.. నిజానికి పురుషులకు మాత్రమే కాదట... స్త్రీలకు కూడా తమ భర్తల పట్ల కొంతకాలానికి ఆసక్తి తగ్గుతుందట. కానీ.. వారు తొందరగా బయటపడరట.అసలు.. తమ పార్ట్ నర్ పట్ల ఆసక్తి తగ్గిపోతే... ఓ మహిళ ఎలా ప్రవర్తిస్తుంది..? ఎలా ఆ విషయాన్ని గుర్తించవచ్చో... ఓ సారి చూద్దాం...
Image: Getty Images
1.నిజానికి.. అందరు మహిళల్లో కామన్ గా ఉండే ఒక అలవాటు జెలసీ. తమ భర్త కు ఎవరైనా దగ్గరవ్వాలని చూసినా...కనీసం చూసినా, మాట్లాడినా కూడా జెలసీ ఫీలౌతూ ఉంటారు. కానీ... అలా కాకుండా.. తమ భర్త విషయంలో జెలస్ ఫీలవ్వడం లేదు అంటే ఆలోచించాల్సిందే. భర్త ఎవరితో మాట్లాడినా ఎలాంటి భయం లేకుండా.. ఎక్కువ సేపు బయట ఉన్నా పట్టంచుకోవడం లేదంటే వారికి మీ మీద ఆసక్తి తగ్గినట్లే.
Image: Getty Images
2.మీరు నమ్మినా నమ్మకపోయినా... స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు. ముఖ్యంగా భర్త విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడతారు. వారే ఎక్కువగా ప్రశ్నలతో విసిగిస్తారు. అలా కాకుండా.... మిమ్మల్ని ప్రశ్నలతో విసిగించకుండా... ఒకవేళ మీరు ప్రశ్నలు వేసినా వాటికి పొడి పొడి సమాధానాలు చెబుతున్నారు అంటే.. వారికి మీ మీద ఆసక్తి తగ్గిందని అర్థం చేసుకోవాలి.
Image: Getty Images
3.చాలా మంది స్త్రీలు.. తమ భర్త ఇలా ఉండాలి... అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. వారికి నచ్చకపోతే.. అర ఇంచు గడ్డం పెరిగినా ఒప్పుకోరు. అలాంటిది.. మీరు విపరీతంగా గడ్డం పెంచేసినా.. వాళ్లకు నచ్చని దుస్తులు ధరించినా ఏమీ పట్టించుకోడం లేదు అంటే.. వారికి మీ మీద ఆసక్తి తగ్గినట్లే.
4.ఆడవారు దేనినైనా సహిస్తారు కానీ... తమతో సమయం గడపకుండా భర్తలు బిజీ బిజీగా ఉంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. అలాంటిది మీరు గంటలు గంటలు బిజీగా వర్క్ తో గడుపుతున్నా వారు పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారంటే.. మీ మీద ఆసక్తి తగ్గి ఉండొచ్చు.
happy couple life
5.ఇక చాలా మంది స్త్రీలు.. భర్తను విసిగిస్తూ ఉంటారు. అలా చెయ్యి.. ఇలా చెయ్యి అని చెప్పడం.. కంప్లైంట్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సడెన్ గా అలాంటివి చేయడం తగ్గించారంటే కూడా ఆలోచించాల్సిన విషయమే,
Image: Getty Images
6.ఇక మరీ ముఖ్యంగా సెక్స్ విషయంలో దూరం పెడుతున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇష్టంలేకుండా,.. స్త్రీలు కలయికలో చురుకుగా పాల్గొనరు.
Image: Getty Images
7.దంపతుల మధ్య చిన్న చిన్న పొరపాట్లు జరగడం చాలా కామన్. అలాంటిది జరిగినప్పుడు మనం వెంటనే మన పార్ట్ నర్ కి క్షమాపణలు చెబుతూ ఉంటాం. అయితే.. మీ భార్య అలా కాకుండా... మరోలా ప్రవర్తిస్తున్నారంటే మీరు ఆలోచించుకోవాల్సిందే.