బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
పెళ్లి చేసుకోవడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోవచ్చు. ఇది మీకు ఆనందాన్ని కలిగించొచ్చు కూడా. ఎందుకంటే జీవితంలో పెళ్లి ఎంతో స్పెషల్ మరి. కానీ పెళ్లి తర్వాత మీ బరువు, బాధ్యతలు పెరుగుతాయి. కొత్త కొత్త బాధ్యతలను స్వీకరించడానికి మీరు సిద్దంగా ఉండాలి. ఎందుకంటే పెళ్లితో పాటుగా మీపై ఎన్నో బాధ్యతలు పడతాయి. కుటుంబం, పిల్లలు, భర్త, సమాజం ఇలా ఎన్నో బాధ్యతలను మీరు నెరవేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న మీరొక్కరే కాదు.. మీ భాగస్వామిని కూడా అగడండి. మీరిద్దరూ ఒక్కటిగా ఉండి ఇంటి నిర్వహణ నుంచి పిల్లల వరకు బాధ్యతలను నిర్వహించగలరా? లేదో? తెలుసుకోండి. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు, మీ కెరీర్ లక్ష్యాలు, ప్రణాళికలు, భవిష్యత్తు గురించి కూడా ప్రశ్నలు అడగడం మర్చిపోకండి. ఈ విషయాలు పెళ్లి కాకముందే మీ భాగస్వామికి తెలిస్తే మీ వైవాహిక బంధాన్ని కొనసాగించడం, నిర్వహించడం సులువవుతుంది.