టాంపోన్ తో కలయికలో పాల్గొంటే ఏమౌతుందో తెలుసా?

First Published | Dec 15, 2023, 3:23 PM IST

పీరియడ్ రావడం సర్వ సాధారణం. అయితే కొంతమంది ఆడవారికి ఈ సమయంలో కూడా లైంగిక కోరికలు కలుగుతాయి. అయితే కొంతమంది టాపోన్ తోనే కలయికలో పాల్గొనాలనుకుంటారు. కానీ దీనివల్ల ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 
 

పీరియడ్స్ లైంగిక జీవితానికి అడ్డంకేమీ కాదు. ఈ సమయంలో కూడా మీరు కలయికలో పాల్గొనొచ్చు. కాకపోతే పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. లేదంటే ఎన్నో లైంగిక సమస్యలు వస్తాయి. అయితే ఈ సమయంలో కొంతమంది కలయికకు దూరంగా ఉంటారు. మరికొంతమంది పాల్గొంటారు. ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం. అయినప్పటికీ.. కలయిక సమయంలో పీరియడ్స్ ఉత్పత్తులను వాడటం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. టాంపోన్ తో కలయికలో పాల్గొంటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

అసౌకర్యం లేదా నొప్పి

లైంగిక కార్యకలాపాల సమయంలో టాంపోన్లను ఉపయోగించడం వల్ల యోనిలో నొప్పి కలుగుతుంది. అలాగే ఘర్షణ, కదలిక అసౌకర్యం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే టాంపోన్ యోనిలోకి లోతుగా నెట్టబడుతుంది.

టాంపోన్ ను తొలగించడంలో ఇబ్బంది

లైంగిక సంపర్కం టాంపోన్ ను యోనిలోకి మరింత లోపలికి నెట్టుతుంది. అందుకే దీనిని బయటకు తీయడం కష్టంగా మారుతుంది. ఈ టాంపోన్ ను తీయలేకపోతే ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం రావొచ్చు. 

Latest Videos



సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది

టాంపోన్ తో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల యోనిలోకి అదనపు బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. దీనివల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

చికాకు

యోనిలో టాంపోన్ ఉన్నప్పుడు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల యోని సన్నితమైన కణజాలాలుచిరిగిపోవడం లేదా చికాకుకు గురయ్యే అవకాశం ఉంది, ప్రత్యేకించి రుతుక్రమ ఉత్పత్తి పొడిగా ఉంటే.
 

Tampon

టాంపోన్ విచ్ఛిన్నం

లైంగిక చర్య సమయంలో టాంపోన్ విచ్ఛిన్నం కావొచ్చు. దీనివల్ల యోనిలో టాంపోన్ ఆనవాళ్లు ఉండే అవకాశం ఉంది. ఇది అంటువ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

పీహెచ్ అసమతుల్యత

కలయిక సమయంలో టాంపోన్ వంటి విదేశీ వస్తువులను యోనిలో ఉండటం వల్ల దీని సహజ పీహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో యోనిలో చికాకు లేదా సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. 
 

టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ప్రమాదం 

ఈ సమస్య చాలా అరుదుగా వస్తుంది. కలయిక సమయంలో టాంపోన్ ను కలిగి ఉండటం వల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది స్టెఫిలోకాకస్ ఆరియస్ ను ఉత్పత్తి చేసే యాంటిజెన్ వల్ల కలిగే ప్రాణాంతక సమస్య. దీనివల్ల జ్వరం, దద్దుర్లు, హైపోటెన్షన్, డీస్క్వామేషన్, మయాల్జియా  వంటి సమస్యలు వస్తాయి. 

click me!