ఈ కాలం అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడటం లేదు..?

Published : Aug 16, 2025, 02:53 PM IST

పెళ్లి తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది. పెళ్లికి ముందు ఉన్న స్వేచ్ఛ పెళ్లి తర్వాత అలానే ఉంటుంది అనే గ్యారెంటీ ఏదీ లేదు. అందుకే చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకోకుండా.. ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. 

PREV
15
Marriage

ప్రతి అమ్మాయికీ పెళ్లి విషయంలో చాలా కలలు ఉంటాయి. తనను బాగా ప్రేమించే, మంచి భర్త రావాలని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. తమ పెళ్లి ఇలా జరగాలి, అలా జరగాలి అని ఊహించుకుంటారు. కానీ.. ఇవన్నీ ఒకప్పుడు మాత్రమే. ప్రస్తుతం అమ్మాయిల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇతరుల మీద ఆధారపడి ఉండాలని అమ్మాయిలు అనుకోవడం లేదు. అసలు..పెళ్లి ఎందుకు చేసుకోవాలి..? మేము కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నాం.. మా కాళ్లమీద మేము బతకగలం.. అలాంటిది ఇంకొకరికి సేవలు చేస్తూ ఎందుకు బతకాలి అని భావిస్తున్నారు. పెళ్లి అంటేనే ఇంట్రస్ట్ లేదు అని సింపుల్ గా చెప్పేస్తున్నారు. అసలు.. పెళ్లి విషయంలో అమ్మాయిల అభిప్రాయం మారడం వెనక కారణం ఏంటి? పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదో ఇప్పుడు తెలుసుకుందాం...

25
స్వాతంత్ర్యం కోరుకోవడం...

గతంలో అమ్మాయిలు ఆర్థికంగా ప్రతి విషయంలోనూ పెళ్లికి ముందు తల్లిదండ్రుల మీద, పెళ్లి తర్వాత భర్తమీద ఆధారపడేవారు. కానీ.. ఈ కాలం అమ్మాయిలు అలా ఆధారపడాలని అనుకోవడం లేదు. ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని అనుకుంటున్నారు. బాగా చదువుకొని, మంచి కంపెనీల్లో పని చేస్తున్నారు.ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడటం లేదు. పెళ్లి చేసుకోకుండా కూడా సంతోషంగా ఉండగలం అనే ధీమాతో ఉంటున్నారు. అందుకే పెళ్లి మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. అంతేకాదు.. పెళ్లి చేసుకుంటే.. తమకు నచ్చినట్లుగా ఉండలేమని.. వేరొకరి కంట్రోల్ లో తాము ఉండాల్సి వస్తుందని భయపడుతున్నారు.

35
కెరీర్ ప్రాధాన్యత

మహిళలు గతంలో కంటే ఎక్కువ విద్యావంతులు కావడంతో, వారు తమ కెరీర్‌లలో విజయం సాధించాలని కూడా కోరుకుంటారు. చాలా మంది అమ్మాయిలు మొదట తమ కెరీర్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటే తమ కెరీర్ కి బ్రేక్ పడుతుందనే భయం వారిలో ఉంటుంది. అందుకే పెళ్లి విషంలో ఆసక్తి చూపడం లేదు.

విడాకుల భయం..

ప్రస్తుత కాలంలో పెళ్లి ఎంత ఈజీగా చేసుకుంటున్నారో.. అంతే ఈజీగా విడిపోతున్నారు. విడాకుల రేట్లు నిరంతరం పెరుగుతున్నాయి. కలిసి జీవితాంతం ఉండలేమని విడాకులు తీసుకుంటున్నవారిని చూసి అమ్మాయిల అభిప్రాయం మారుతోంది. ఈ మాత్రం దానికి అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు.. ఒంటరిగా ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. దీని వెళ్లే పెళ్లి మీద ఆసక్తి చూపడం లేదు.

45
ఇంటి బాధ్యతల ఒత్తిడి

వివాహం తర్వాత, మహిళల బాధ్యతలు పెరుగుతాయి. ఆమె ఉద్యోగి అయినా లేదా గృహిణి అయినా, ఇంటి పనులన్నింటినీ , కుటుంబ సభ్యులందరి కోరికలు , అవసరాలను చూసుకోవడం కోడలి విధిగా పరిగణిస్తారు. ఇలాంటి పనులన్నీ చేయడానికి ఈ కాలం అమ్మాయిలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాము మాత్రమే ఎందుకు ఈ పనులు చేసుకోవాలి అనే భావన అమ్మాయిల్లో పెరిగిపోతుంది. అందుకే.. పెళ్లి మీద ఆసక్తి చూపించడం లేదు.

55
సామాజిక జోక్యం

పెళ్లి తర్వాత, ఎలాంటి దుస్తులు ధరించాలి?, మీకు పిల్లలు ఎప్పుడు పుడతారు? ఇలాంటి సమస్యలు తరచుగా స్త్రీ స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తాయి. వివాహం తర్వాత, ఒక అమ్మాయి జీవితంలో సామాజిక జోక్యం పెరుగుతుంది. వివాహం చేసుకోవడం వల్ల వారి వ్యక్తిగత స్థలం తగ్గుతుందని అమ్మాయిలు భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, వారు వివాహం నుండి దూరంగా వెళ్లడం ప్రారంభిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories