Relationship: ఈ విషయాలు సీక్రెట్ గా ఉంచితే.. భార్యభర్తల మధ్య సమస్యలే రావు..!

Published : Aug 11, 2025, 05:21 PM IST

భార్యభర్తల మధ్య ఉండే కొన్ని రహస్యాలను పొరపాటున కూడా మూడో వ్యక్తికి షేర్ చేయకూడదు.

PREV
15
భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే...

జీవితాంతం కలిసి ఉండాలనే ఆశతోనే పెళ్లి అనే బంధంతో ఒక్కటౌతారు. అయితే.. కొన్ని మనస్పర్థలు, సమస్యల కారణంగా చాలా మంది దంపతులు విడాకుల బాట పడుతూ ఉంటారు. నిజానికి, వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. నమ్మకం, సాన్నిహిత్యం, భావోద్వేగ అనుబంధం ఆధారంగా ఏర్పడిన పవిత్రమైన బంధం. ఇలాంటి బంధంలో చిన్న చిన్న తేడాలు రావడం చాలా సహజం. అలాంటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి కానీ.. పెద్దది చేసుకోకూడదు. ముఖ్యంగా.... భార్యభర్తల మధ్య ఉండే కొన్ని రహస్యాలను పొరపాటున కూడా మూడో వ్యక్తికి షేర్ చేయకూడదు. ఎలాంటి విషయాలు పంచుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

25
మీ భాగస్వామి బలహీనతలను...

భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తిలోనూ లోపాలు ఉంటాయి. మీ జీవితభాగస్వామి కూడా దీనికి మినహాయింపు కాదు. అందుకే మీరు వారి భయాలు, తప్పులు, అభద్రతాభావాలను ఇతరులకు చెప్పకూడదు. అలా చెబితే.. మీరు వీరికి ద్రోహం చేసిన వారు అవుతారు. అంతేకాకుండా.. ఇతరుల ముందు మీ జీవితభాగస్వామి చులకన అయ్యే అవకాశం ఉంది. అది మీ ఇద్దరి మధ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. అందుకే, పొరపాటున మీ భాగస్వామి సీక్రెట్స్ ఎవరితోనూ చెప్పకూడదు.

35
మీ ఇద్దరి సమస్యలు మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి..

చాలా మంది తమ భార్యభర్తల మధ్య వచ్చే సమస్యలు, గొడవలను తమ బంధువులు, స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చెప్పడం వల్ల తమ మనసుకు హాయిగా అనిపిస్తుందని అనుకుంటారు. కానీ.. పొరపాటున కూడా చెప్పకూడదు. కోపంలో మీరు మీ భాగస్వామి గురించి నెగిటివ్ గా చెబుతారు. మీ బంధువులు, స్నేహితుల మనసులో వారిపై నెగిటివ్ అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. మీ మధ్యలో సమస్యలు తీరినా కూడా... వారి మనసులో అభిప్రాయం మారదు. అందుకే.. మీ సమస్యలను ఎవరికీ చెప్పకూడదు.

45
మీ భాగస్వామి ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవడం..

డబ్బు విషయాలు చాలా సున్నితమైనవి. మీ జీవిత భాగస్వామి ఆదాయం, అప్పులు, ఖర్చు అలవాట్లు లేదా ఆర్థిక ఇబ్బందులను ఇతరులకు వెల్లడించడం ఇబ్బంది , అపనమ్మకానికి కారణమవుతుంది. ఆర్థిక సంబంధిత విషయాలు కేవలం దంపతుల మధ్య మాత్రమే ఉండాలి, బయటి ప్రపంచంతో కాదు.

55
బెడ్ రూమ్ కి సంబంధించిన విషయాలు...

శారీరక , భావోద్వేగ సాన్నిహిత్యం వివాహంలో ఒక ప్రైవేట్ , పవిత్రమైన భాగం. అది హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ, బెడ్ రూమ్ విషయాలను పంచుకోవడం దంపతుల మధ్య నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అనవసరమైన గాసిప్‌లకు దారితీస్తుంది. దానిని సురక్షితంగా ఉంచడం సంబంధంలో నమ్మకం , సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

భాగస్వామి రహస్యంగా చెప్పిన రహస్యాలు..

మీ భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో నమ్మితే తప్ప... తనకు సంబంధంచిన సీక్రెట్స్ మీతో చెప్పరు. అలాంటి సీక్రెట్స్ మీరు ఇతరులతో పొరపాటున కూడా పంచుకోకూడదు. అలా మీరు ఇతరులకు చెప్పడం నమ్మకద్రోహం అవుతుంది. ఇద్దరి మధ్య తేడాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories