Relationship: మీ భాగస్వామిపై కోపంగా ఉన్నారా.. అయితే ఇలా మాత్రం ప్రవర్తించకండి!

First Published | Sep 2, 2023, 1:15 PM IST

Relationship:సాధారణంగా భార్యాభర్తలు అన్నాక ఏవో గొడవలు జరుగుతూనే ఉంటాయి. గొడవలు జరుగుతున్నప్పుడు ఎక్కువగా మన కడుపులో ఉన్న రోషం మొత్తం ఆ సమయంలో బయటికి వచ్చేస్తుంది. అయితే అలా చేయకూడదు అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. అదేంటో చూద్దాం.
 

ప్రతి కుటుంబంలోని భార్యాభర్తలు అన్నాక చిన్న, పెద్ద గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు వాదోపవాదాలు కూడా జరగడం సహజం. గొడవ జరుగుతుంది కదా అని సంబంధం తెగిపోయేటట్లుగా నోటికి వచ్చిన ప్రతి మాట మాట్లాడకూడదు. అలా జరిగితే నష్టపోయేది మనమే అని గుర్తుపెట్టుకోండి.
 

మనం సరదాగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు కన్నా కోపంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఎక్కువ ప్రభావితం అవుతాం అని తెలుసుకోండి. సాధారణంగా మీ భాగస్వామిపై కోపం వస్తే ప్రెసెంట్ సిచువేషన్ కి తగ్గట్టుగా మాత్రమే మాట్లాడుకోండి.
 


అంతేగాని గతంలో జరిగిన గొడవల గురించి, వాటి పుట్టు పూర్వోత్తరాల   గురించే తవ్వకండి. కోపంలో ఉన్నప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందో అవతల వాళ్ళకి కూడా అంతే బాధ కలుగుతుందని గ్రహించండి. కాబట్టి అవతలి వాళ్ళు కూడా ఏం చెబుతున్నారో వినటానికి ప్రయత్నించండి.
 

మీరు చెప్పాలనుకున్నది కూడా ఎంత శాంతంగా వీలైతే అంత శాంతంగా చెప్పటానికి ప్రయత్నించండి. నువ్వు స్వార్థపరుడివి, నీవల్ల ప్రయోజనం లేదు అనే మాటలు అసలు ప్రయోగించకండి. ఇవి బంధాన్ని ముగిసిపోయే దశ వరకూ తీసుకువెళ్లే  పెద్ద మాటలు.
 

కాబట్టి ఎంత కోపంలో ఉన్నా ఆలోచించి మాట్లాడండి. అలాగే ఎందుకు కోప్పడుతున్నారో కూడా ఒకసారి ఆలోచించండి. కోపానికి కారణం నిజమేనా లేదంటే తొందరపడుతున్నామా అని కూడా ఆలోచించండి. ఎందుకంటే కొన్ని సార్లు గొడవలు జరిగిన తరువాత అసలు ఇంట్లో జరిగిన గొడవకి, మీకు వచ్చిన కోపానికి సంబంధం ఉండకపోవచ్చు.
 

మీకు ఇంకా ఆవేశం చల్లారక, గొడవ పెద్దదైపోతుంది అని అనిపించినప్పుడు  వీలైతే కాసేపు ఇంట్లోంచి బయటికి వెళ్లి మనసు ప్రశాంతించిన తర్వాత అప్పుడు ఇంటికి రండి. అలా అని సమస్య నుంచి పారిపోకండి. ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి కూడా కొంచెం ప్రశాంతంగా ఫీల్ అవుతారు. అప్పుడు ఇద్దరు కూర్చుని సమస్యని పరిష్కరించుకోవచ్చు.

Latest Videos

click me!