పెళ్లికి ముందు మీ ఏజ్ గ్యాప్ గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే ఈ సమస్యలొస్తయ్..

First Published | Sep 1, 2023, 9:38 AM IST

వయసుతో సంబంధం లేకుండా ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు అంటున్నారు. 
 

సాధారణంగా పెళ్లి కోసం అబ్బాయిలను వెతికేటప్పుడు వారి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఏ జాబ్ చేస్తాడు, సొంత ఇల్లు ఉందా, మంచివాడేనా అనే విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. కానీ పెళ్లికి ఖచ్చితంగాచూడాల్సింది వధువరుల మధ్య ఏజ్ గ్యాప్. అవును ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వైవాహిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మీరు కలకాలం కలిసుండటానికి సహాయపడుతుంది. సినీ తారల నుంచి సాధారణ జీవితం గడుపున్న వారి వరకు చాలా మంది ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఇది వారి వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు అంటున్నారు. వైవాహిక జీవితం దీర్ఘకాలం కొనసాగాలంటే రిలేషన్ షిప్ లో ఏజ్ గ్యాప్ ఎందుకు ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ఒక అధ్యయనం ప్రకారం.. లైంగిక సంబంధాలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా, రోగాల నుంచి దూరంగా ఉంచుతాయి.  అందుకే అన్ని వయస్సుల వారు లైంగికంగా చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం. నిజానికి శరీరంలో ఈస్ట్రోజెన్ లోపం వల్ల మహిళల్లో సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. ఈ హార్మోన్లు మహిళల పునరుత్పత్తి వ్యవస్థను పెంచడమే కాకుండా.. స్త్రీ లైంగిక కార్యకలాపాలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల లైంగిక అసమర్థత ఏర్పడుతుంది.
 

Latest Videos


ఏజ్ గ్యాప్ పై ఎందుకు దృష్టి పెట్టాలి? 

దంపతుల ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే విభేదాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇద్దరూ తమ తప్పులను అస్సలు అంగీకరించరు. ఒకరిమీదికి ఒకరు నెట్టుతారు. ఏ భాగస్వామి పెద్దవారైతే వారు ఆధిపత్యం వహించే అవకాశం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి రిలేషన్ షిప్స్ తొందరగా విడిపోయే అవకాశం ఉంది. ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Image: Getty

లైంగిక అనుకూలతను తగ్గించొచ్చు

ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే ..దాని ప్రభావం మీ లైంగిక జీవితంపై పడుతుంది. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీరంలో లిబిడో అంటే లైంగిక వాంఛ తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల  మీరు మీ భాగస్వామిని సంతృప్తిపరచలేరు. దంపతుల వయసులో సాధారణ వ్యత్యాసం ఉంటే ఇద్దరి లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. లైంగికంగా చురుకుగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉంటారు.

Image: Getty

భావోద్వేగ అనుబంధం తగ్గొచ్చు

ఇద్దరు భాగస్వాముల్లో ఒకరు మరింత పరిణతి చెందితే.. తమ భాగస్వామి వేరే వ్యక్తితో సంబంధంలో ఉన్నట్టు భావిస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీ ఇద్దరి మధ్య అనుబంధం తగ్గడం ప్రారంభమవుతుంది. దీనికితోడు ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరుగుతాయి. అదే వివాహేతర సంబంధానికి కారణమని సర్వేల్లో తేలింది.
 

Image: Getty

ఆలోచన, అవగాహనలో వ్యత్యాసం 

వయసు రీత్యా.. ఎక్కువ వయసున్న జంటలు వారి ఆలోచనలు ఒకదానికొకటి సరిపోలవు. ఒక భాగస్వామి ఎక్కువ పరిపక్వత కలిగి ఉంటే.. మరొకరు చిన్నపిల్లలగా ఉంటే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో భాగస్వాములు ఇద్దరూ భిన్నంగా ఆలోచిస్తారు. ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకోలేరు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

Image: Getty

వంధ్యత్వానికి వయస్సు అంతరం 

ఏజ్ గ్యాప్ వల్ల సంతానలేమి సమస్య వచ్చే అవకాశాలు పెరుగుతాయి. వృద్ధుల్లో అంగస్తంభన సమస్య, వీర్యకణాల లోపం వంటి సమస్యలు పెరుగుతాయి. అలాగే యోని పొడిబారడం, వృద్ధ మహిళల్లో లైంగిక కోరిక తగ్గడం దీనికి ఒక కారణం కావొచ్చు.
 

కొన్నిసార్లు ప్రయోజనకరం కూడా

రక్షిత భావన

తమ కంటే వయసులో పెద్దవారైన వ్యక్తులు తమ భాగస్వామికి రక్షణ భావనను కలిగిస్తారు. వీరి భాగస్వాములు మానసికంగా, శారీరకంగా రక్షణ పొందుతారు. నిజానికి మీ భాగస్వామి పరిపక్వత మిమ్మల్ని అనేక సమస్యల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది. వారు సేఫ్ గా ఫీలవుతున్నారు.
 

నిర్ణయం తీసుకోవడం సులభం 

మీ భాగస్వామి పరిణతి చెందితే వారి నిర్ణయం చాలా ఆలోచనాత్మకంగా ఉంటుంది.. వారు మీ నిర్ణయాలలో మీకు సహాయపడతారు. అలాగే మంచి, చెడుల గురించి మీకు అర్థమయ్యేట్టు చెప్తారు. దీనితో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. 

click me!