ఒక అబ్బాయి అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తుంటే ఆ అబ్బాయినే తన జీవన మార్గం (Way of life) అని భావిస్తుంది. ఇక ఆ అబ్బాయితోనే తన ప్రయాణం అని నిర్ణయించుకుంటుంది. ఆ అబ్బాయి పై తన ప్రేమను తెలపడానికి అనేక మార్గాలను ఎంచుకుంటుంది. ప్రేమించిన అబ్బాయితో తనకు సంబంధించిన అన్ని విషయాలనూ వెల్లడిస్తుంది. ఆ అమ్మాయికి అబ్బాయి పై పూర్తి నమ్మకం, విశ్వాసం (Confidence) ఏర్పడుతుంది.
అందుకే తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా అబ్బాయితో చర్చించడానికి ఇష్టపడుతుంది. తను ప్రేమించిన అబ్బాయి ఎప్పుడు సంతోషంగా (Happy) ఉండేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూంటుంది. ప్రేమించిన అబ్బాయితో సరదాగా ఎక్కువ సేపు సమయం గడపడానికి ప్రయత్నిస్తుంది. పదేపదే ప్రేమించిన అబ్బాయి ధ్యాసలో (Attention) ఉండిపోతుంది. తల్లిదండ్రుల తర్వాత తానే సర్వస్వమని బాధిస్తుంది.
ఏ చిన్న విషయంలోనైనా నిర్ణయం (Decision) తీసుకోవాలన్న అబ్బాయితో చర్చిస్తుంది. మొదట అబ్బాయి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తుంది. అబ్బాయికి ఏ చిన్న కష్టమొచ్చినా తను ధైర్యం చెప్పి ఓదారుస్తుంది. ఏ ప్రత్యేకత లేకపోయినా అబ్బాయికి బహుమతులు కొనుగోలు చేస్తుంది. ప్రేమించిన అబ్బాయిని సర్ప్రైజ్ (Surprise) చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఆమెకు వంట రాకుండా కష్టమైన ప్రేమించిన వ్యక్తి కోసం వంట చేసి అబ్బాయి మనసును గెలుచుకుంటుంది.
అబ్బాయి ఒక్కరోజు కనపడకపోతే పదేపదే ఫోన్ చేస్తూ తన యోగక్షేమాలను అడుగుతుంది. అబ్బాయి నలుగురులో ఉన్నా తన చూపు మాత్రం అబ్బాయి మీదే ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు గొడవలు సర్వసాధారణం (Ubiquitous). ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఏర్పడినప్పుడు ముందుగా తనే సర్దుకోవడానికి (Adjust) ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ప్రేమించిన అబ్బాయితో ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేదు కనుక.
ప్రేమించిన వ్యక్తి అందమైన పరాయి అమ్మాయితో మాట్లాడితే తట్టుకోలేదు. అబ్బాయితో వాదనకు దిగుతుంది. అబ్బాయితో గడపబోయే అందమైన భవిష్యత్తు గురించి అనేక కలలు (Dreams) కంటుంది. తన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నది, ఏం సాధించాలని అనుకుంటున్నదో అబ్బాయితో పంచుకుంటుంది. తాను ప్రేమించిన వ్యక్తి ఒక మహారాజుగా తను ఒక మహారాణి గా ఫీల్ అవుతుంది. ఇలా ఇంతగా ప్రేమించే అమ్మాయిని పొందిన అబ్బాయి అదృష్టవంతుడు (Lucky).