వర్జినిటీ కోల్పోయే ముందు.. ఈ విషయాలు తెలుసుకోవాలి..!

First Published Nov 13, 2021, 12:26 PM IST

హస్తప్రయోగం చేయడం ద్వారా లేదా మీ భాగస్వామి వేళ్లతో మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు కూడా మీరు మీ కన్యత్వాన్ని కోల్పోవచ్చు.

ఈ రోజుల్లో వర్జినిటీ కోల్పోవడం చాలా మందికి విషయం కాకపోవచ్చు. పెళ్లికి ముందే.. సెక్స్ విషయంలో చాలా మంది  అడ్వాన్స్ అయిపోతారు. తాము ప్రేమించిన వారితో కలయికలో పాల్గొంటున్నారు. అది వారి పర్సనల్ విషయం. అయితే..  విర్జినిటీ కోల్పోవడానికి ముందు మాత్రం కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ కచ్చితతంగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సెక్స్ అనేది సంభోగం మాత్రమే కాదు. ఇది ఫోర్‌ప్లే, ఓరల్ సెక్స్ కూడా దాని కిందకే వస్తుంది.   హస్తప్రయోగం చేయడం ద్వారా లేదా మీ భాగస్వామి వేళ్లతో మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు కూడా మీరు మీ కన్యత్వాన్ని కోల్పోవచ్చు.

సెక్స్ సమయంలో మీ హైమెన్ చిరిగిపోయినప్పుడు మీరు పాప్ శబ్దాన్ని వినపడుతుందని.. అలా జరిగితేనే వారు వర్జిన్ అని చాలా మంది అపోహ పడుతుంటారు. అయితే.. అందులో ఎలాంటి నిజం లేదు.   మీ హైమెన్ అనేది ఒక వదులుగా ఉండే కణజాలం, అది ఎటువంటి శబ్దం లేకుండా చిరిగిపోతుంది. అయితే.. అది చిరిగే సమయంలో.. కొందరికి భరించలేని బాధ కలగవచ్చు. మరికొందరికి.. అలాంటి బాధ కలగకుండా.. ఆనందంగా కూడా ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కోలా జరిగే అవకాశం ఉంటుంది.
 

మీరు మీ కన్యత్వాన్ని కోల్పోయిన తర్వాత మీ రూపురేఖలు మారవు. అంతేకాకుండా, అద్భుతమైన సెక్స్ కారణంగా మీరు కొంచెం మెరుస్తూ ఉండవచ్చు! మీ హార్మోన్లు మరింత ఉత్సాహంగా పనిచేస్తాయి. తొలి కలయిక తర్వాత  ఎక్కువ సెక్స్‌లో పాల్గొనాలనే కోరికను కూడా కలిగే అవకాశం ఉంది.

ఇక తొలిసారి కలయికలో పాల్గొన్న అందరికీ.. రక్తం వస్తుంది అనేకోవడం కూడా పొరపాటు. కొందరికి వచ్చే అవకాశం ఉంది. అయితే.. వచ్చినా.. అది ధారాపాతం కూడా రాదు. సినిమాల్లో చూపించినట్లు... నిజ జీవితంలో జరగదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మీరు ఎంత సౌకర్యవంతంగా ఉంటే, భావప్రాప్తిని సాధించడానికి మీకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. మీరు సుఖంగా ఉన్నప్పుడు, మీ క్లైమాక్స్‌కి చేరుకోవడానికి మీకు తగినంత ప్రేరణ లభిస్తుంది. కానీ మొదటిసారి సెక్స్ చేస్తున్నప్పుడు ఉద్విగ్నత అనిపించడం చాలా సహజం. తొలి కలయిక లోనే.. సెక్స్ ని ఆస్వాదించేశామని కొందరు గొప్పలు చెబుతుంటారు. అందులో నిజం ఉండకపోవచ్చు. 

click me!