మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడా లేదా అనేది ఇలా తెలుసుకోండి!

First Published | Nov 11, 2021, 4:38 PM IST

ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమకి (Love) దారి  తీస్తుంది. ఇలా ప్రేమ మొదలైనప్పుడు అమ్మాయి మనసులో పలువిధాల అనుమానాలు వస్తూంటాయి. తను ప్రేమించిన అబ్బాయి తనకు సరిజోడా కాదా అని పలు అనుమానాలు మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. అయితే ఈ ఆర్టికల్ (Article) ద్వారా మీరు ప్రేమించిన అబ్బాయిని ఎలా నమ్మాలో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

ఒక అబ్బాయి అమ్మాయి మధ్య మొదట స్నేహబంధం (Friendship) ఏర్పడి తర్వాత ప్రేమగా మారుతుంది. ఇలా ప్రేమించిన అబ్బాయి చివరి వరకు మీకు తోడుగా ఉంటాడో లేదో అని పలు అనుమానాలు (Suspicions) వేధిస్తుంటాయి. మీతో అన్ని సంతోషాలను పంచుకున్న వారు కష్టాలను పంచుకుంటారో లేదో ముందు తెలుసుకోవాలి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి తను తప్పించుకోవచ్చు అనే ధైర్యం ఇవ్వాలి. అలా ఉన్నప్పుడు అబ్బాయి ఎలాంటి మనస్సు కలిగినవాడో మనకు వెంటనే అర్థమవుతుంది.
 

అన్ని కష్టాలను, ఇబ్బందులను అర్థం చేసుకొని మీకు తోడు ఉండి వాటిని పరిష్కరించగలిగిన అబ్బాయి మంచి మనసు కలిగినవాడే అని చెప్పాలి. మీ అన్ని కష్టాలను తనతో పంచుకున్నప్పుడు మీకు ధైర్యం చెప్పి ముందుకు నడిపించే అబ్బాయిని నమ్మవచ్చు. అలా కాదని మీ కష్టాలను పంచుకుంటున్నప్పుడు తనలో చికాకు కనబడుతుంటే అతను మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించలేదని అర్థం. తన కష్టసుఖాలను (Hardships) మీతో పంచుకున్నప్పుడు తను మీతో మంచి రిలేషన్ షిప్ (Relationship) లో ఉన్నట్టు అర్థం.


మీరు చేసే ప్రతి చిన్న పనిని ప్రోత్సహించి (Encouraging) మిమ్మల్ని పై స్థానంలో ఉండేలా చూసుకోవాలి అనుకునే అబ్బాయిని నమ్మవచ్చు. అలా కాదని మీ విజయాలను ఓర్వలేక తనకంటే కిందిస్థాయిలో ఉండాలనుకునే అబ్బాయిని నమ్మరాదు. మీ విజయాలనే తన విజయంగా భావించే అబ్బాయిని నమ్మవచ్చు. తన అవసరాలకు మాత్రమే మీతో సమయం గడపాలనుకునే అబ్బాయిల్ని నమ్మకూడదు. ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కొందరు కలయికలో పాల్గొంటారు. ఇలా చేయడం మీ ఇద్దరి భవిష్యత్తుకి (Future) మంచిది కాదు.
 

మన బంధం ఎంతవరకు ఉంటుందో తెలియనప్పుడు ఇలా తప్పు చేయడం మంచిది కాదు. మొదట అబ్బాయి మనస్తత్వం (Mentality) ఎలాంటిదో పూర్తిగా మనం తెలుసుకోవాలి. అనుబంధాలకు విలువ ఇస్తాడో లేదో తెలుసుకోవాలి. తన జీవితంలో ముందుకు ఎదగాలనే ఆకాంక్షలు ఉన్నప్పుడు తనకు జీవితం మీద ఆసక్తి ఉంటుంది. ఇలా తన ఆశయానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని విజయం (Success) సాధించాడు. ఇలా కష్టం విలువ తెలిసిన అబ్బాయిని నమ్మవచ్చు. డబ్బులకు విలువ ఇవ్వాలి.
 

ముఖ్యంగా మీ నుంచి ఆర్థికంగా ఆశపడరాదు. మనం తప్పు దారిలో వెళుతుంటే సరిదిద్దగలిగే మనస్తత్వం    అబ్బాయికి ఉండాలి. తన తోటి వారితో సరదాగా (Fun) మాట్లాడుతూ, నవ్వుతూ (Smiling), నవ్వించే మనస్తత్వం ఉండాలి. ఇలాంటి అబ్బాయిలు కచ్చితంగా నమ్మవచ్చు.

Latest Videos

click me!