రోజూ 'సెక్స్'లో పాల్గొంటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

First Published | Nov 12, 2021, 3:10 PM IST

 భార్యాభర్తల మధ్య సెక్స్ (Sex) ఒక మధురమైన తీయని అనుభూతి. అది ఇద్దరి మనుషుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. వారి అన్యోన్యతకు చక్కటి నిదర్శనంగా ఉంటుంది. మీకు తెలుసా భార్యాభర్తలిద్దరూ సెక్స్ లో పాల్గొంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా రోజూ సెక్స్ లో పాల్గొంటే  కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

చాలామంది వివాహమైన కొత్తలో సెక్స్ లో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తి (Interest) చూపిస్తారు. తరువాత రానురాను తమ బిజీ పనులతో ఒత్తిడి పెరగడంతో పనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సెక్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపటం లేదు. సెక్స్ ఇద్దరు దాంపత్యజీవితాన్ని తెలియజేస్తుంది. భార్యాభర్తలిద్దరూ వారి బిజీ పనులతో వారు ఉండడంతో వారి మధ్య దూరం పెరుగుతోంది. దీంతో వారికి ఒకరి మీద ఒకరికి చికాకు (Irritation) ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే మీరు  రెగ్యులర్గా సెక్స్ లో పాల్గొనాలి.

అప్పుడే సెక్స్ మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. దాంతో పని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. సెక్స్ లో పాల్గొంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని శృంగార నిపుణులు చెబుతున్నారు. సెక్స్ లో పాల్గొంటే  నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి. సెక్స్ లో పాల్గొన్నాక అలిసి పోవడంతో నిద్ర మనకు బాగా పడుతుంది. అలాగే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) కలిగిస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. సాధారణంగా వచ్చే చిన్న చిన్న వ్యాధులను జ్వరం, దగ్గు, జలుబు వీటిని దూరంగా ఉంచుతుంది.


శరీర క్యాలరీలను తగ్గిస్తుంది. కనీసం వారానికి రెండు సార్లైనా సెక్స్ లో పాల్గొంటే గుండె సంబంధిత వ్యాధులు రావు. శరీర హార్మోనులను బ్యాలెన్స్ గా ఉంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.  వారి మధ్య గొడవలు తగ్గించి వారిని సంతోషంగా ఉంచుతుంది. భార్య తో సెక్స్ లో ఎక్కువ సార్లు పాల్గొనే వారి కంటే తక్కువ సార్లు పాల్గొనే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తాజాగా అధ్యయనంలో తేలింది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ (Testosterone) హార్మోన్, మహిళల్లో ఈస్ట్రోజెన్ (Estrogen) హార్మోన్ విడుదల అవుతుంటాయి. వీటి వల్ల ఇద్దరికీ చాలా ప్రయోజనాలున్నాయి.

కుటుంబ సభ్యులతో ఏర్పడే ఒత్తిడిని (Stress) తగ్గించి మీ మనసును మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఉద్యోగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో సెక్స్ లో పాల్గొనడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు ఎక్కువ సేపు ఏకాంతంగా గడపడానికి ప్రయత్నించాలి.

అప్పుడే మెదడు పనితీరు ఉత్తేజపరుస్తుంది.  ఇటువంటి పనితీరుకు అవసరమయ్యే హార్మోన్లను (Hormones) విడుదల చేస్తుంది. కనుక సెక్స్ లో ఎక్కువ సార్లు రెగ్యులర్ గా పాల్గొంటే మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సెక్స్ లో పాల్గొంటే నష్టమేమీ జరగదు. అలాగని పరాయి స్త్రీలతో సెక్స్ లో పాల్గొనరాదు.

Latest Videos

click me!