Relationship: కొత్తగా లవ్ స్టార్ట్ అయిందా.. ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి?

First Published | Jul 6, 2023, 11:25 AM IST

Relationship: వయసులో ఉన్నప్పుడు మంచి చెడు ఆలోచించకుండానే లవ్ లో పడిపోతూ ఉంటారు నేటితరం యువత. తీరా నిజం తెలిసాక లబోదిబోమంటారు. అందుకే కొన్ని జాగ్రత్తలతో లవ్ & రిలేషన్ స్టార్ట్ చేయండి.
 

అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లలకి ప్రపంచమంతా అందంగా కనిపిస్తుంది ప్రతి వ్యక్తి మంచి వాడిగానే కనిపిస్తాడు. అప్పుడప్పుడే వస్తున్న ఫ్రీడం వాళ్లకి లేని ధైర్యాన్ని ఇస్తుంది అందుకే ముందు వెనుక ఆలోచించకుండా తనని ఏమాత్రం ఇంప్రెస్ చేసినా కూడా వాళ్లతో లవ్ లో పడిపోతూ ఉంటారు.

కానీ తర్వాత ఎదురయ్యే పరిణామాల మీద వాళ్ళకి అవగాహన ఉండదు. తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఏం ప్రయోజనం ఉండదు కాబట్టి ఒక వ్యక్తితో మీరు అండ్ రిలేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలని గుర్తుపెట్టుకోండి.
 


ఇందులో ముఖ్యంగా ఇంపార్టెన్స్ గురించి ఆలోచించండి. ముందు మీకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా నటించే కేవలం తన ఇంపార్టెన్స్ కోసం మాత్రమే ఆలోచించే వ్యక్తితో జీవిత ప్రయాణం చాలా కష్టం. ఎందుకంటే తను ఇంపార్టెన్స్ ముఖ్యం అనుకునేవాడు..
 

 ఎదుటి వాళ్ళ కోసం ఏ మాత్రం రిస్క్ చేయలేడు. ఇక తర్వాత చూడవలసింది ఎదుటి వ్యక్తి నిజాయితీపరుడు అవునా కాదా అని నిర్ధారించుకోండి ఎందుకంటే అబద్దాలు చెప్పే వారితో రిలేషన్ ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉండదు. ఎప్పుడో ఒకరోజు మీ రిలేషన్ ని కూడా అబద్ధం చేసేసి వెళ్ళిపోతారు.
 

ఇక తర్వాత చూడవలసినది పొసెసివ్ నెస్. మిమ్మల్ని అతిగా ప్రేమించే వ్యక్తి మీరు ఇంకెవరితోని మాట్లాడటానికి ఇష్టపడడు అది మొదట్లో చాలా బాగుంటుంది కానీ రాను రాను అది చిరాకును పుట్టిస్తుంది. ఈ ఓవర్ కేరింగ్ వల్ల మీరు ఒక్కొక్కసారి మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి మీ కుటుంబాన్ని దూరం చేయవచ్చు కాబట్టి పొసెసివ్ నెస్ వున్న వ్యక్తికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

love

అలాగే భవిష్యత్తు మీద ప్రణాళిక లేని వాడితో కూడా జీవన ప్రయాణం కష్టతరమని తెలుసుకోండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే అవతలి వ్యక్తితో కమిట్ అవ్వండి లేదంటే ఒక బ్రేకప్ మనిషిని ఒక్కొక్కసారి జీవితాన్ని అంతం చేసుకునే వరకు తీసుకువెళ్తుంది కాబట్టి ముందుగానే ఆలోచించండి.

Latest Videos

click me!