చాలా బంధాలు పెళ్లయిన కొత్తలో ఎంతో అందంగా ఆప్యాయంగా ఉంటాయి. ప్రపంచంలో తన భాగస్వామి తప్ప మరెవరు వద్దు అని ఎంత గాఢంగా పెనం వేసుకుంటుంది ఆ బంధం. అలాంటి మానసిక స్థితిలో ఉన్నప్పుడు తన భాగస్వామి తప్పు చేసిన అది తమకి ఒప్పుగానే కనిపిస్తుంది.
కానీ పోను పోను చిన్న తప్పు కూడా క్షమించరాని నేరంగా మారుతుంది బంధం భారంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ తేడా దీనికి కారణాలు ఏమిటి మళ్ళీ ఆ బంధాన్ని నూతన ఉత్సాహంతో నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి చూద్దాం. మీ భాగస్వామితో ఏమైనా గొడవలు జరిగినప్పుడు..
జీవితం తొలి రోజుల్లో జరిగిన మధురమైన సంఘటనని గుర్తు చేసుకోండి అప్పుడు మనిషిలో మార్పు పరిస్థితుల వలన అని గ్రహిస్తారు. అలా కాకుండా తప్పు చేశారు అంటూ సాధిస్తుంటే అవతలి వ్యక్తి కూడా మీలో తప్పులను వెతుకుతూ సమస్యని మరింత జటిలం చేస్తారు.
పెళ్లయిన కొత్తలో రోజంతా తనతోనే గడిపిన భాగస్వామి పోను పోను బాధ్యతల వలన ఆ విధంగా గడపలేక పోతారు. అది కూడా మీ భాగస్వామికి చికాకు కలిగించవచ్చు కాబట్టి ఎందుకు ఎక్కువ సమయం తమతో గడపలేకపోతున్నారు మీ భాగస్వామికి వివరించండి.
అలా అని భాగస్వామిని పట్టించుకోకుండా బాధ్యతల్లో పడిపోకండి. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళండి అంతేకానీ ఆమె చిరాకు పడిందని మీరు కూడా చిరాకు పడితే మాట మాట పెరిగి బంధం బరువు అవుతుంది. ఒకరి మాట ఒకరు వినలేని పరిస్థితికి వచ్చినప్పుడు..
అవసరమైతే పెద్దవాళ్ల సలహా సహాయం తీసుకోండి లేదంటే రిలేషన్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి. వారు సూచించే సలహాలని పాటించండి. పాజిటివ్ గా ఆలోచిస్తే బంధం ఎప్పుడు కొత్తగానే అందంగానే ఉంటుంది. కాబట్టి నూతన ఉత్సాహంతో బంధం బలపరుచుకోవటానికి ఇద్దరు కలిపి అడుగులు వేయండి.