ఒక్కో కౌగిలింతకు ఒక్కో అర్థం.. మరి మీ భాగస్వామిని ఎలా హగ్ చేసుకుంటున్నారు

First Published | Dec 22, 2023, 1:57 PM IST

ప్రేమను చూపించడానికి ఎన్నో మార్గాలున్నాయి. కొంతమంది బహుమతులు ఇస్తూ భాగస్వామిపై ఉన్న ప్రేమను వెల్లడిస్తుంటారు. బహుమతులే కాదు.. ఒక కౌగిలింత కూడా మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పేస్తుంది తెలుసా? 

ఒక్క కౌగిలింత వేయి పదాలతో సమానమంటారు చాలా మంది. ఎందుకంటే కౌగిలి అవతలి వారికి ఎన్నో ఊసులను చెప్తుంది. మీకు తెలుసా? ఆత్మీయులు కౌగిలించుకుంటే బాధ తగ్గుతుంది. ఆనందం రెట్టింపు అవుతుంది. అంతేకాదు ఈ కౌగిలింత భాగస్వామిని మీకు దగ్గర చేస్తుంది. మీ భాగస్వామికి మీ కౌగిలింతే భద్రత. హగ్ మీ సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
 

ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టే.. అవకాశం దొరికినప్పుడల్లా భాగస్వామిని కౌగిలించుకోండని నిపుణులు చెప్తుంటారు. ఆప్యాయత గల కౌగిలింత ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను, గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అయితే కౌగిలింతలు ఎన్నో రకాలుగా ఉంటాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 
 


భుజం మీద తలపెట్టి హగ్ చేసుకోవడం

మీ భాగస్వామిని మీరు ఇలా కౌగిలించుకుంటే.. మీరు వారి సమక్షంలో ప్రశాంతంగా ఉంటారని అర్థం. అలాగే వారి స్పర్శ మీకు ఆనందాన్ని కలిగిస్తుందన్న అర్థ వస్తుంది. వీరి కౌగిలి మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
 

బ్యాక్ హగ్

బ్యాక్ హగ్ అర్థం మీ భాగస్వామి మిమ్మల్ని చాలా కాలంగా మిస్ అవుతున్నారని అర్థం. వెనక నుంచి మీ భాగస్వామి కౌగిలించుకుంటే.. అతను మిమ్మల్ని ప్రేమించాలనుకుంటున్నాడని అర్థం చేసుకోండి. వెనుక నుంచి కౌగిలించుకున్నప్పుడు వారు మిమ్మల్ని రక్షిస్తారని కూడా ఇది సూచిస్తుంది.
 

గ్రేస్ అండ్ వెస్ట్ హగ్ 

ఇది మీకు, మీ భాగస్వామికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని సూచిస్తుంది. అంటే మీలో ప్రేమ, నమ్మకం ఎక్కువ అని అర్థం. మీ సంబంధాన్ని మరింత మెరుగ్గా మార్చడానికి మీ భాగస్వామితో మీరు ఎంత కనెక్ట్ అయ్యారో ఇది సూచిస్తుంది. 

నెవర్ లెట్ యు గో హగ్

ఇది ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకోవడం. దీనిలో మీ భాగస్వామి మిమ్మల్ని రెండు చేతులతో కౌగిలించుకుంటారు. ఈ హగ్ .. మీరిద్దరూ విడిపోవడానికి భయపడుతున్నారని చూపిస్తుంది. నిబద్ధత, నమ్మకం, ఐక్యతకు ఈ హగ్ ప్రతీక.

ఒక చేత్తో కౌగిలించుకోండి

మీ భాగస్వామి ఒక చేత్తో మిమ్మల్ని కౌగిలించుకుంటే దానికి రెండు అర్థాలుంటాయి. సాధారణంగా ఇలాంటి కౌగిలింతను స్నేహితుల మధ్య ఎక్కువగా చూస్తుంటాం. మీ ఇద్దరి మధ్య స్నేహం బలంగా ఉందని కూడా సూచిస్తుంది. కానీ మీ భాగస్వామి మీ సంబంధాన్ని పబ్లిక్ గా వ్యక్తపరచడానికి ఇష్టపడటం లేదని కూడా ఇది సూచిస్తుంది.
 

Latest Videos

click me!