మీరు కలయికలో పాల్గొన్నప్పుడు మీ శరీరానికి ఏమౌతుందో తెలుసా?

First Published Dec 21, 2023, 2:51 PM IST

కలయిక శారీరక ఆనందాన్నే కాదు మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. అయితే కలయికలో పాల్గొన్నప్పుడు మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. వాటిని ఎప్పుడైనా గమనించారా? 
 

లైంగిక కార్యకలాపాల సమయంలో మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ సమయంలో కేవలం కొన్ని నిమిషాల్లోనే శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. లైంగిక కార్యకాపాల్లో పాల్గొనడం వల్ల మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలను కలుగుతాయి. అయితే దీనిలో పాల్గొనడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

మీరు సంతోషంగా ఉంటారు

అవును మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు మీ మెదడు ద్వారా ఆక్సిటోసిన్ అనే  హ్యాపీ హార్మోన్లు పెద్ద మొత్తంలో విడుదలవుతాయి. నిజానికి కలయిక ఒక గొప్ప ఒత్తిడి బస్టర్ అని నిపుణులు చెప్తారు. ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం కూడా దానిని అంగీకరిస్తుంది.

యోని లూబ్రికేషన్

లైంగిక కార్యకలాపాల సమయంలో రక్త నాళాలు విస్తరించడం ప్రారంభిస్తాయి. అలాగే అన్ని పునరుత్పత్తి అవయవాలకు రక్తం ప్రవాహం పెరుగుతుంది. ఇది చివరికి యోని లూబ్రికేషన్ కు దారితీస్తుంది. 
 

Sex Life

లోతుగా శ్వాస 

మీరు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నప్పడు మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అలాగే దీనివల్ల మీరు గట్టిగా శ్వాస తీసుకుంటారు. ఇవన్నీ ప్రధానంగా మొదటి దశలో భాగంగా ఉంటాయి. దీనిలో మీకు కోరికలు ఎక్కువగా ఉంటాయి. 

సూపర్ సెన్సిటివ్ అవుతారు

మీ శరీరంలో రక్త ప్రవాహం పెరిగేకొద్దీ,  లైంగిక కార్యకలాపాల సమయంలో నైట్రిక్ ఆక్సైడ్ కూడా పెరుగుతుంది. అందుకే మీ చనుమొనలు, మెడ, జననేంద్రియాలు వంటి మీ అన్ని ఎరోజెనస్ బిందువులు చాలా చురుకుగా, సున్నితంగా మారుతాయి. 
 

ఉద్వేగానికి చేరుకున్నప్పుడు

మీరు ఉద్వేగానికి చేరుకున్నప్పుడు మీ కటి కండరంలో అసంకల్పితమైన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల మీరు ఆనందాన్ని పొందుతారు. అయినప్పటికీ కొన్నిసార్లు ఈ సంకోచం చేయి దాటిపోతుంది. అలాగే మీకు తిమ్మిరి సమస్య కూడా రావొచ్చు. 

కేలరీలను బర్న్ చేస్తారు

కలయిక వల్ల మీరు కేలరీలను కూడా బర్న్ చేయగలుగుతారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. మీరు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నప్పుడు కొన్ని కేలరీలు బర్న్ అవుతాయి. అంటే ఇది కూడా మీరు కొద్దిగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

click me!