ఈ అబద్దాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా?

First Published Dec 21, 2023, 3:42 PM IST

ఎప్పుడూ నిజమే మాట్లాడాలని మన తల్లిదండ్రులు చెప్తుంటారు. కానీ రియల్ లైఫ్ లో ప్రతిసారీ నిజాలే మాట్లాడటం సాధ్యం కాదన్న ముచ్చట మనలో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే కొన్నిసార్లు మనకు ఇష్టమైనవారిని సంతోషంగా ఉంచడానికి కొన్ని అబద్దాలను చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు తెలుసా? 
 

మీరెప్పుడైనా ఆలోచించారా? అందరూ నిజాలే మాట్లాడుకుంటే పరిస్థితి ఏంటని. నవ్వొస్తుంది కాదా? కేవలం నిజాలే మాట్లాడితే ఒకరికొకరు మాట్లాడుకోవడమే మానేస్తారేమో. ఏదేమైనా మొత్తం నిజాలే మాట్లాడటం వల్ల కొన్ని కొన్ని సార్లు రిలేషన్ షిప్ లో ఎన్నో గొడవలొస్తాయి. అందుకే వీలైనంత వరకు మన బంధాన్ని కాపాడుకోవడానికి చిన్న చిన్న అబద్దాలను చెప్పాల్సి వస్తే నిర్మొహమాటంగా చెప్పేయండి. రిలేషన్ షిప్ ను కాపాడుకోవడానికి ఎలాంటి అబద్దాలను చెప్పాలో ఇప్పుడు తెలుసుకుందాం..


పిల్లలతో..

కొంతమంది పిల్లల్లో ఆత్మవిశ్వాసం చాలా వరకు లోపిస్తుంది. మరికొందరు పిల్లలు చదువులో బలహీనంగా ఉంటారు. అందుకే వీళ్ల మనోధైర్యాన్ని పెంచడానికి మీరు వారిని ప్రశంసించండి. కొన్ని సమయాల్లో పిల్లలు తప్పులు కూడా చేయొచ్చు. తప్పు చేశాడు కదా అని అరవడమో, కోప్పడటమో, కొట్టడమో చేయకండి. వీటికి బదులుగా పిల్లలకు ఏది మంచో? ఏది చెడో? చెప్పండి. మీ పిల్లలు వంట నేర్చుకుంటున్నప్పుడు, వంటగదిలో మీ కోసం ఏదైనా తయారు చేస్తున్నప్పుడు రుచిగా లేకపోయినా వారిని మెచ్చుకోండి. ప్రశంసించండి. ఆ తర్వాత ప్రేమతో చిన్న తప్పు చేసి ఉంటే చెప్పండి.
 

వైవాహిక జీవితంలో..

సాధారణంగా భార్యాభర్తల మధ్య పూర్తి పారదర్శకత ఉండాలని నమ్ముతారు. వీళ్లు ఒకరితో ఒకరు నిజాలు చెప్పుకోవడమే కాకుండా వారి భావాలను కూడా గౌరవించుకోవాలి. అయితే మీ భార్య మీ పుట్టినరోజు నాడు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తుంటే.. భర్తకు ఈ సమయంలో అబద్దం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే భార్య లేదా భర్త ఈ ఏర్పాట్లు చేస్తుంటే.. అన్నీ చెబితే ఎలా ఆశ్చర్యపోతారు? ఒకరి సంతోషాన్ని మరొకరు కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్పాల్సిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తప్ప వారిని బాధపెట్టడానికి లేదా మోసం చేయడానికి కాదు. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి. 
 

Image: Getty Images

ఇరుగుపొరుగు వారితో..

కొంతమంది ఇరుగుపొరుగువారు అనవసరంగా ఇంట్లోకి తొంగిచూడొచ్చు. లేదా మీ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి పరిస్థితిలో మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ఇక్కడ కోపంతో మీరు ఊడిపోయి వారిని తిట్టడానికి బదులుగా ప్రశాతంగా ఉండాలి. అలాగే అత్యవసర పరిస్థితిలో మొదట మీకు సహాయపడేది మీ పొరుగువారేనన్న సంగతిని మీరు గుర్తుంచుకోవాలి. అందుకే కొన్ని విషయాలను విస్మరించి వారితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి.

స్నేహితులతో కలిసి..

ఫ్రెండ్ షిప్ లో పారదర్శకత కూడా అవసరమని  చెప్తుంటారు. స్నేహితులకు ఏదైనా నచ్చకపోతే వారు తమ అసమ్మతిని స్పష్టమైన మాటల్లో వ్యక్తపరచాలి. ఇలా జరగకపోతే అది సంబంధంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్ శ్రేయోభిలాషి అయితే కొన్నిసార్లు అతనితో మీరు అబద్దాలు చెప్పడమే మంచిది. ఉదాహరణకు.. మీ స్నేహితుడు బాగా అనారోగ్యంతో ఉంటే.. అతని పట్ల సానుభూతి చూపించొద్దు. అలాగే బలహీనంగా కనిపిస్తున్నావని ఎప్పుడూ చెప్పొద్దు. మీరు చెప్పేది కరెక్టే అయినా అది అతని మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
 

click me!