శృంగారానికి ముందు ఈ ఫుడ్.. దివ్యమైన ఔషధమే..!

First Published | Mar 27, 2021, 3:28 PM IST

శృంగారంలో చాలా మందికి శీఘ్ర స్ఖ‌ల‌న స‌మ‌స్య ఉంటుంది. అయితే దానికి యాల‌కుల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. యాల‌కుల‌ను తీసుకుంటే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది.
 

యాల‌కులు కేవ‌లం సువాస‌న కోసం మాత్ర‌మే కాదు.. మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్యల నుంచి మ‌న‌ల్ని బ‌య‌ట ప‌డేయ‌డానికి కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వాటిని చాలా మంది వంట‌లు, టీలో వేసుకుని తీసుకుంటుంటారు.
అయితే యాల‌కులు శృంగార ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌కు కూడా అమోఘంగా ప‌నిచేస్తాయ‌ని.. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. మ‌రి ముఖ్యంగా శృంగార సమస్యలను చెక్ పెట్టడానికి యాలకులు పనిచేస్తాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.

ఆందోళన నుంచి బయటపడాలంటే యాలకులు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. శృంగారం లో సంతృప్తిలేని వారి నిత్యం యాలకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజు రెండు టీస్పూన్ల యాలకులు తీసుకుంటే వీర్యం బాగా వృద్ధి చెందుతుందని పరిశోధనల్లో తేలింది.
ప్రస్తుత ఉరుకుల ప్రపంచంలో చాలా మందికి శృంగార సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో శీఘ్ర స్ఖలన సమస్య సర్వసాధారణమైంది. ఈ సమస్యకు యాలకులతో పుల్ స్టాప్ పెట్టొచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు.
శృంగారంలో పాల్గొనడానికి గంట ముందు ఇవి తీసుకున్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
యాల‌కులు ఆందోళ‌న నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. ఒత్తిడి, మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి మూడ్ ను మారుస్తాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తాయి. శృంగారంలో స‌రిగ్గా పాల్గొన‌లేక‌పోతున్నామ‌ని భావించే వారు నిత్యం ఏదో ఒక రూపంలో యాల‌కుల‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది.
నిత్యం 1 లేదా 2 టీస్పూన్ల యాల‌కులను తీసుకుంటే వీర్య వృద్ధి చెందుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే న‌పుంస‌క‌త్వం స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
శృంగారంలో చాలా మందికి శీఘ్ర స్ఖ‌ల‌న స‌మ‌స్య ఉంటుంది. అయితే దానికి యాల‌కుల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చు. యాల‌కుల‌ను తీసుకుంటే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన‌వ‌చ్చ‌ని ఆయుర్వేదం చెబుతోంది.
చ‌ర్మంపై ఏర్ప‌డే న‌ల్ల‌మ‌చ్చ‌ల‌ను యాల‌కులు పోగొడ‌తాయి. జుట్టు ఊడిపోవ‌డం, వెంట్రుక‌లు చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.
యాల‌కుల‌ను నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి త‌గ్గుతుంది. గ్యాస్ పోతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. మ‌ల‌బ‌ద్ద‌క స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Latest Videos

click me!