సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ దీనికి బానిసలే. తమ ప్రతీ కదలిక అందులో పోస్ట్ చేయడం దానికి వచ్చే రియాక్షన్స్ తో మురిసిపోవడం మామూలే. ఫేస్ బుక్, ట్విటర్, వాట్సప్... ఇలా అనేక మాధ్యమాల్లో తమ గురించిన పోస్టులు చేస్తుంటారు.
undefined
అయితే జీవితంలో సంతోషంగా ఉన్న జంటలు ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారని, అరుదుగా అందులో పోస్టులు చేస్తుంటారని అంటున్నారు నిపుణులు. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు.
undefined
సోషల్ మీడియాలో ఇతర జంటలు చేసే పోస్టులు చూసి చాలా జంటలు అసూయ పడుతుంటాయి. వారు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారని.. తామలా లేమని పోల్చుకుంటుంటారు. అంతేకాదు అది చాలా రొమాంటిక్ కూడా అనిపిస్తుంది. అయితే వాస్తవం అలా ఉండకపోవచ్చు. ఇలాంటి జంటలు తమ మధ్య తరచుగా వచ్చే గొడవలకు ఇదొక పరిష్కారంగా ఎంచుకోవచ్చు.. లేదా దీనివల్లే గొడవపడొచ్చు.
undefined
అయితే సోషల్ మీడియాలో పోస్టులు చేయడానికి సిగ్గుపడే చాలా జంటలు పర్సనల్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉంటారని, సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారని తేలింది. దీనికి, సోషల్ మీడియా పోస్టులకు ఏంటి సంబంధం, సంతోషకరమైన జంటలు తమ జీవితాల్ని అరుదుగా పోస్ట్ చేయడానికి కారణాలు ఏంటో చూడండి..
undefined
సోషల్ మీడియాలో తమ గురించి పోస్ట్ చేశారంటే.. తమ మధ్య ఉన్న అనుబంధం గురించి నలుగురూ మెచ్చుకోవాలని, వారికేదో నిరూపించాలనే భావన అంతర్లీనంగా ఉంటుంది.
undefined
అయితే సంతోషకరమైన జంటలు తాము తమ భాగస్వామి పట్ల ఎంత ప్రేమతో ఉన్నారో, తన వల్ల ఎందుకు సంతోషంగా ఉన్నారో ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు. వారి మధ్య ఉన్న నిజాయితీని ఎవరికీ ఒప్పించాల్సిన అవసరం లేదని భావిస్తారట.
undefined
సోషల్ మీడియాలో తరచుగా తమ వ్యక్తిగత జీవితం గురించి పోస్టులు చేసేవారు దానికి బానిసలుగా మారిపోతారట. అదొక డ్రగ్స్ లా వారికి అలవాటవుతుందట. లైక్ లు, కామెంట్లు, పొగడ్తలకు అడిక్ట్ అవుతారట. వారి జీవితాల్లో విషయాలు పంచుకోవడానికి ఎక్కువమంది స్నేహితులో, బంధువులో లేకపోవడం కూడా కారణమేనట. అందుకే తమ ఉనికిని చాటు కోవడానికి క్రమం తప్పకుండా పోస్ట్ లు చేస్తుంటారట.
undefined
వర్తమానంలో జీవించడానికి ఇష్టపడతారు. సంతోషకరమైన జంటలు తాము తిరిగిన ప్రదేశాలు, తాము ఎంజాయ్ చేసిన ఫొటోలను తమ ట్రిప్ అయిన తరువాత.. కొంత గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేస్తారు. అంతేకానీ తాము ఎక్కడ తింటున్నాం, ఏం చేస్తున్నాం అని వెంటవెంటనే పోస్టులు పెట్టి కామెంట్స్ చూసుకోరు. ఎందుకంటే తాము అక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చారు కానీ, మీ పొగడ్తల కోసమో, మీ రియాక్షన్ కోసమో రాలేదన్న విషయం వారికి బాగా తెలుసు. అంతేకాదు వారు ఆ క్షణాన్ని తన భాగస్వామితో ఉండడాన్ని ఎంజాయ్ చేస్తారు.
undefined
సోషల్ మీడియా పైకి కనిపించేంత ఆహ్లాదంగా ఏమీ ఉండదు. అదో పోటీ ప్రపంచం. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండాలంటే మిగతావారికంటే తాము మెరుగు అని నిరూపించుకోవాల్సి వస్తుంటుంది. ఈ పరుగులో పడి అభద్రతకు గురవుతారు. ఎప్పటికప్పుడు వేరే వాళ్లతో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అయితే హ్యాపీ కపుల్ కి ఈ సమస్య ఉండదని వేరే చెప్పాలా?
undefined
సోషల్ మీడియా పైకి కనిపించేంత ఆహ్లాదంగా ఏమీ ఉండదు. అదో పోటీ ప్రపంచం. ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండాలంటే మిగతావారికంటే తాము మెరుగు అని నిరూపించుకోవాల్సి వస్తుంటుంది. ఈ పరుగులో పడి అభద్రతకు గురవుతారు. ఎప్పటికప్పుడు వేరే వాళ్లతో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. అయితే హ్యాపీ కపుల్ కి ఈ సమస్య ఉండదని వేరే చెప్పాలా?
undefined
హ్యాపీ కపుల్స్ విజయరహస్యం నిజాయితీగా ఉండడమే. వీరు ఒకరిపట్ల ఒకరు నిజాయితీగా ఉండడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అంతేకాని ఒకరి సంతోషం కోసం మరొకరి మీద ఆధారపడరు. ఇలాంటి విషయాలకు ఈ జంటలు సమయాన్ని వృథా చేసుకోరు. సంతోషం కోసం సోషల్ మీడియాపై ఆధారపడరు. తమ సంతోషంతో ఇతరుల్ని అసూయపడేలా చేయాలనో, వారికి ఏదో నిరూపించుకోవాలనో ఆశించరు.
undefined