Relationship: కొత్త దాంపత్యంలో గొడవలు జరుగుతున్నాయా.. కంగారు పడకండి, అలా జరగడం సహజమే!

Published : Sep 11, 2023, 11:20 AM IST

Relationship: కొత్తగా పెళ్లయిన దంపతులలో తరచూ గొడవలు జరుగుతుంటే వాళ్ళ కాపురం ఏమైపోతుందో అని కంగారుపడుతూ ఉంటారు పెద్దవాళ్లు . అయితే ఇది అంత కంగారు పడవలసిన విషయం కాదని,ప్రతి సంసారంలోని జరిగేదే అని అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. అదేంటో చూద్దాం.  

PREV
16
 Relationship: కొత్త దాంపత్యంలో గొడవలు జరుగుతున్నాయా.. కంగారు పడకండి, అలా జరగడం సహజమే!

 కొత్తగా పెళ్లయిన జంట కొంతకాలం వరకు చాలా సంతోషంగా సంసారాన్ని సాగిస్తారు. ఆ తరువాత మొదలవుతాయి అసలు గొడవలు. ఈ గొడవలు చూసిన వారెవరైనా వాళ్ళ సంసారం ఏమైపోతుందో అని కంగారు పడిపోతూ ఉంటారు. అయితే అలా కంగారు పడవలసిన అవసరం లేదని, పెళ్లయిన జంటల్లో చాలామంది ఈ సమస్యని ఎదుర్కొంటున్నాయని, కాలక్రమేణా ఇద్దరిలోని వచ్చే పెద్దరికం ఇద్దర్నీ మరింత దగ్గర చేస్తుందని అంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్.
 

26

 అయితే ఏ విషయం గా గొడవలు వస్తాయి అనే విషయానికి వస్తే.. తన భార్య ఇంటికి వస్తూనే తన వారందరిలోని కలిసిపోవాలి అని కోరుకుంటాడు భర్త. అలాగే అతనిని వెంటనే అర్థం చేసుకొని తనకి అన్నీ సమకూర్చాలి అని భావిస్తాడు. అయితే ఒక ఆడపిల్ల కొత్త వారితో కలిసి పోవడానికి కొంచెం సమయం పడుతుంది.
 

36

అప్పుడు భర్తగా మీరే ఆమెకి సపోర్ట్ ఇవ్వాలి. ఆమె ప్రేమతో ఆమెని మీ కుటుంబంలో కలుపుకోవాలి. అలా కాకుండా ఆమెని కసురుకున్నట్లయితే ఆమె కూడా తిరిగి గొడవ పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా వహించండి. అలాగే ప్రతి ఆడపిల్ల తన భర్త తను ఏమీ అడగకుండానే అన్ని సమకూర్చాలని..
 

46

 ఏమీ చెప్పకుండానే తన మనసు అర్థం చేసుకోవాలని అనుకుంటుంది. అయితే అది అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. మీరు, మీ మనసు పూర్తిగా అతను తెలుసుకోకుండా మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టతరమైన పని. కాబట్టి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అతనికి కొంచెం సమయం ఇవ్వండి.
 

56

 అలాగే పెళ్లికి ముందు ఇద్దరి అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. ఒకరి అలవాట్లు ఒకరికి కొత్తగా ఉండటం మూలాన కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని వలన కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే పెళ్లికి ముందు తన భాగస్వామి ఇలా ఉండాలి అని ఒక అంచనా  కి వస్తారు అమ్మాయిలు, అబ్బాయిలు. అయితే వచ్చిన వ్యక్తి అంచనాలకి విరుద్ధంగా ఉంటే భరించలేక పోతారు.
 

66

 ఆ కోపంతో చిన్న చిన్న విషయాలకి కూడా గొడవ పడుతూ ఉంటారు. అయితే ఇవి కంగారు పడవలసిన అంత పెద్ద గొడవలేవి కాదు. ఈ గొడవలు వారిద్దరిని ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. రాను రాను ఒకరికి ఒకరు అలవాటు అవుతూ ఉండటం వలన ఈ సమస్యలు కూడా తొలగిపోతాయి.

click me!