గతంతో పోలిస్తే ఈ తరంలో ఆడవాళ్లు అక్రమ సంబంధాలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. క్షణికావేశంలో నిండైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అయితే ఇందుకు కారణం కేవలం ఆడవాళ్ళదేనా, ఆ భర్త దా.. ఆ కుటుంబానిదా.. ఈ సమాజాన్నిదా.. ఎవరిది తప్పు.
ఒకసారి విశ్లేషిద్దాం. నిజానికి ఏ స్త్రీ కూడా తన సంసారాన్ని వదులుకొని పరాయి వ్యక్తితో జీవించాలని కోరుకోదు. అలా కోరుకుంది అంటే తను ఇప్పుడు జీవిస్తున్న జీవితం సంతృప్తికరంగా లేదు అని అర్థం. స్త్రీ ఆస్తికన్నా ఆప్యాయతని, అభిమానాన్ని ఎక్కువగా కోరుకుంటుంది.
అలాంటి ఆప్యాయత తన భర్త నుంచి లభించ లేనప్పుడు ఆమె బయట వ్యక్తి నుంచి దానిని ఆశిస్తుంది. కుటుంబ సభ్యులు తనకి విలువ ఇవ్వలేనప్పుడు, ఆ ఇంట్లో తన ఉనికి కనిపించినప్పుడు అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది స్త్రీ.
అయితే తప్పంతా భర్తలతో లేదంటే కుటుంబానిదో అనటం కూడా తప్పే. నేడు జరుగుతున్న కొన్ని సంఘటనలని చూస్తే నిజంగా ఆడవాళ్లేనా అనిపించేలాగా ఉన్నాయి. నిజానికి వారి వెనుక ఉండే అంతరార్థం ఏమిటో మనకు తెలియదు. కానీ వాళ్ళ భర్తల పట్ల వాళ్లు తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా ఘోరంగా ఉంటున్నాయి.
ఏది ఏమైనాప్పటికీ ఒక భార్యకి ఇవ్వవలసిన గౌరవం ఆ భర్త ఇస్తే ఆమె కోసం టైం కేటాయించగలిగితే, ఆమెని సపోర్ట్ చేస్తూ కుటుంబ సభ్యుల దగ్గర మాట్లాడగలిగితే ఆమె మరొక వ్యక్తి వైపు తిరిగి చూసే అవకాశం ఉండదు అంటున్నారు సైకియాట్రిస్టులు. అలాగే పుట్టింటి వాళ్లు కూడా కూతుర్లని అర్థం చేసుకోవాలి.
వాళ్లు చెప్పే కష్టం వినిపించుకోవాలి. కాపురం అదే సర్దుకుంటుంది అని చెప్పి చేతులు దులిపేసుకుంటే మీ కూతురు తీసుకునే నిర్ణయానికి మీరే బాధ్యులవుతారు. అప్పుడు నష్టపోయేది ఆమె జీవితం మాత్రమే కాదు ఆమెతో ముడిపడి ఉన్న రెండు కుటుంబాలు కూడా రోడ్డున పడతాయి. కాబట్టి ఆడవాళ్ళ మనసు తెలిసి మసులుకోవటం మంచిది.