శృంగారానికి ముందు వీటిని తింటే అంతే సంగతులు

First Published | Sep 10, 2023, 2:56 PM IST

శృంగారానికి ముందు కొన్ని ఆహారాలను అసలే తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇవి మీ సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తాయి. 
 

Couples after sex

శృంగారం వివాహిత జీవితంలో ఒక భాగం. ఇది దంపతుల మధ్య నమ్మకాన్ని పెంచుతుంది. ప్రేమను రెట్టింపు చేస్తుంది. సెక్స్ శారీరకంగా, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మీరు సెక్స్ లో పాల్గొనడానికి ముందు కొన్ని ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మీ సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అలాగే ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనకుండా చేస్తాయి. అంతేకాదు ఇవి మీకు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.  అందుకే సెక్స్ కు ముందు ఎలాంటి  ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బీన్స్  

బీన్స్  ఆరోగ్యానికి మంచిదే. కానీ వీటిలో కూడా చక్కెర అణువులు ఉంటాయి. ఇవి తొందరగా జీర్ణం కావు. అంతేకాక ఇది మీ పెద్దప్రేగుకు చేరుకునే సమయానికి బ్యాక్టీరియా ఈ అణువులను వాయువుగా మారుస్తుంది. దీనివల్ల మీ కడుపు అసౌకర్యంగా మారుతుంది. దీనివల్ల మీకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అందుకే బీన్స్ ను సెక్స్ కు ముందు అసలే తినకూడదు. 
 


Pills before sex

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్స్  చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మీరు బద్దకంగా, నిద్రమత్తుగా ఉంటారు. మీరు లైంగికంగా చురుగ్గా ఉండాలంటే మాత్రం కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పాస్తా వంటి ఆహారాలను తినడం మానేయండి. 

కేకులు, కుకీలు

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించడం మంచిది. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కేకులు, కుకీలను సెక్స్ కు ముందు తింటే మీరు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనలేరు. ఎందుకంటే స్వీట్లలో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. చక్కెర కూడా బాగా ఉంటుంది. ఇవి మీ సెక్స్ డ్రైవ్ ను తగ్గిస్తాయి. అందుకే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా సెక్స్ కు ముందు తినకూడదు. 
 

ఆల్కహాల్

లైంగిక సంపర్కానికి ముందు ఆల్కహాల్ ను తాగడం కూడా మంచిది కాదు. ఎందుకంటే మందు మీ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాదు ఇది మీకు లైంగిక కోరికలు లేకుండా చేస్తుంది. అంతేకాకుండా దీన్ని తాగడం వల్ల మీరు నీరసంగా మారిపోతారు. ఇది మీకు సెక్సీ మూడ్ లేకుండా చేస్తుంది. 
 

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

అవును శృంగారానికి ముందు ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. అంతేకాదు ఇది మీ రక్తప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మీరు భావప్రాప్తికి చేరుకోకుండా చేస్తుంది. 

Latest Videos

click me!