దాంపత్య జీవితం సరిగాలేదు అనడానికి సంకేతాలు ఇవే..!

First Published | Sep 21, 2022, 11:22 AM IST

దంపతులు అన్నాక.. గొడవలు, మనస్పర్థలు చాలా సహజం. అయితే... అవి ఎంత స్థాయిలో ఉన్నాయి అనే విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. వాటి ఆధారంగానే... వారి దాంపత్య జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. 

couple fight

దాంపత్య జీవితం సరదాగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ...  ప్రతి ఒక్కరూ కోరుకున్నట్లుగా బంధం ఉండకపోవచ్చు.  అందరు దంపతులు సంతోషంగా ఉండకపోవచ్చు. దంపతులు అన్నాక.. గొడవలు, మనస్పర్థలు చాలా సహజం. అయితే... అవి ఎంత స్థాయిలో ఉన్నాయి అనే విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. వాటి ఆధారంగానే... వారి దాంపత్య జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు. 

1.దంపతులు ఒకరినొకరు తిట్టుకోవడం, పోట్లాడుకోవడం చాలా సహజం. కానీ.... కోపంలో ఉపయోగించే పదాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొందరైతే ఏకంగా తమ జీవిత భాగస్వామిని బూతులు తిడుతూ ఉంటారు. ఆ తిట్లు మనల్ని బాధపెట్టడం చాలా సహజం. అయితే... వాటి కారణంగా.. మీకు తీవ్ర ఒత్తిడి ఎదురైతే... బాధ ఎక్కువగా అనిపించిందంటే ఆ బంధం సరిగా లేదనే అర్థం.
 



2.ప్రతి చిన్న విషయానికీ.. మీ పై గట్టిగట్టిగా అరవడం, ప్రతి విషయంలోనూ టెంపర్ కోల్పోయి.. కోపం తెచ్చుకుంటూ ప్రతి విషయంలోనూ మీపై కత్తులు నూరుతున్నారు అంటే.. మీ దాంపత్య బంధం సరిగా లేదనే అర్థం.
 

3.ఎక్కవ కాలం  కలిసి ఉన్న దంపతులకు వారి పార్ట్ నర్ ఏ సమయంలో ఎలా ఉంటారు అనే విషయంలో ఓ అవగాహన ఉంటుంది. కానీ... మీ ఊహకు అందకుండా.. కనీసం ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కూడా మీరు ఊహించలేకపోతున్నారు అంటే.... మీ బంధం  సరిగా లేదనే అర్థం.

4.మీ జీవితభాగస్వామి మీతో పాటు... మీ ఇంట్లోని సభ్యులు, ఆఖరికి పెంపుడు జంతువుల విషయంలో కూడా క్రూరంగా ప్రవర్తిస్తారు. మీ జీవితభాగస్వామి కూడా అలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అంటే వారితో ఎక్కువ కాల కలిసి ఉండకపోవడమే మంచిది.

5.ప్రతి విషయంలోనూ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంటే కూడా అర్థం చేసుకోవాలి. అంటే మీరు ఏది చేసినా... నిన్ను వదిలేస్తాను.. దిక్కులేకుండా పోతావ్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారంటే మీ బంధం సరిగా లేదనే అర్థం.

6. మీ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటే కూడా ఆలోచించాలి. కంట్రోల్ చేయడం అంటే.. మీరు తినే ఆహారం, మీరు వేసుకోవాలి అనుకున్న దుస్తులు ఇలా ప్రతి విషయంలోనూ వారికి నచ్చినట్లుగానే ఉండాలని అనుకుంటున్నారంటే... వారికి దూరంగా ఉండటమే మంచిది.

7.మీ జీవితభాగస్వామి ఇంట్లో ఆర్థికపరంగా అన్ని విషయాలను తానే చక్కపెడుతూ... ఆ పొగరుని మీ మీద చూపిస్తున్నారు అంటే... మీ బంధం సరిగా లేదనే అర్థం. తామే సంపాదిస్తున్నామని ఆ పొగరుతో మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారంటే... వారికి దూరంగా ఉండటమే మంచిది.
 

8.మీ జీవితభాగస్వామి అందరి ముందు.. మీ పై జోకులు వేయడం... మిమల్ని తక్కువ చేయడం లాంటివి చేస్తున్నారు అంటే కూడా... మీ బంధం సరిగా లేదనే అర్థం. ఇలాంటి బంధానికి దూరంగా ఉండటమే మంచిది.


9.మీ జీవితభాగస్వామి మిమ్మల్ని శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు అంటే... ఆ బంధం కూడా సరిగా లేదనే అర్థం. అలాంటి బంధానికి దూరంగా ఉండటమే మంచిది.

Latest Videos

click me!