ఈ ఐదు విషయాల్లో భర్త.. భార్య దగ్గర కాస్త తగ్గాల్సిందే..!

First Published | Aug 12, 2024, 5:25 PM IST

భార్య మీకు నచ్చినట్లుగా మారే వరకు .. భర్త కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలట. మరి.. ఎలాంటి విషయాల్లో భర్త కాస్త.. తగ్గి ప్రవర్తించాలో ఇప్పుడు చూద్దాం.. 
 

couple fight


భార్యభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అని అందరూ చెబుతుంటారు. కానీ.. దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలి అంటే.. భర్త కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి. భార్య మీకు నచ్చినట్లుగా మారే వరకు .. భర్త కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలట. మరి.. ఎలాంటి విషయాల్లో భర్త కాస్త.. తగ్గి ప్రవర్తించాలో ఇప్పుడు చూద్దాం.. 

మనుషులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ముఖ్యంగా ఎత్తు, బరువు విషయంలో చాలా తేడాలు ఉంటాయి. ఈ క్రమంలో మీ భార్య పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా.. వారిపై మీరు సెటైర్లు వేయకూడదు. నిజాయితీగా విషయాన్ని చెప్పడం వేరు..సెటైరికల్ గా వారికి చెప్పడం వేరు. ఇలా వారి ఫిజిక్ పై కామెంట్ చేయడం మీకు సరదా అనిపించొచ్చు కానీ.. అది వారిపై చాలా ఒత్తిడి తీసుకువస్తుంది.కాబట్టి.. ఇలాంటి విషయాలు చెప్పకపోవడమే మంచిది. వారు ఎలా ఉన్నా.. ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. 

Latest Videos



వంట చేయడం ఒక కళ, కానీ అది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. ఒక వ్యక్తి చిన్నప్పటి నుండి తన తల్లి వంట తిని పెరుగుతాడు.  పెళ్లి తర్వాత భార్య వంట తినాల్సి వస్తుంది. అప్పుడు.. వెంటనే మా అమ్మ వంట బాగుంటది.. నువ్వు అలా చెయ్యలేదు అని చాలా మంది అంటారు. ఆ మాట అస్సలు అనకూడదు. అది వారికి  ఎక్కువ బాధను కలిగిస్తుంది.

భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాలి  లేదా వారు దాని నుండి కోలుకోవడానికి సమయం ఇవ్వాలి. అంతేకాదు.. నువ్వే గొడవకు కారణం అని భార్యను అనకూడదు.

భార్య అంటే మరో కుటుంబం నుంచి భర్త ఇంటికి వచ్చి కేవలం తనపైనే ఆధారపడి జీవించే జీవి. కాబట్టి మీరు ఆమెను మీ  కుటుంబంలో అంగీకరించారు కాబట్టి మీరు వెంటనే వారిని మీకు నచ్చినట్లు మారమని ఒత్తిడి చేయకూడదు. కాస్త సమయం ఇవ్వాలి.

అదేవిధంగా, మీపై ఆధారపడి మీ ఇంటికి వచ్చే మీ భార్య గురించి లేదా వారి తల్లిదండ్రులు ,బంధువుల గురించి తప్పుగా , ఉదాసీనంగా మాట్లాడటం మానుకోండి, అది మీపై మంచి అభిప్రాయాన్ని తగ్గిస్తుంది.

click me!