ఓయో కథలు: మీ స్టోరీ మీరే రాసుకోండి బాస్

First Published | Aug 10, 2024, 2:58 PM IST

 ప్రతి మనిషి జీవితంలో అనేక అనుభవాలు, ఆనందాలు, బాధలు, అసూయలు, ప్రేమ, అనురాగం, అనుబంధం, ఆకర్షణ, బ్రేకప్ వంటి విభిన్న భావోద్వేగాలు, కోణాలకు సంబంధించిన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ సంఘటనలు ఆసక్తికరంగా, చమత్కారంగా వివరిస్తే, అవి ఆకట్టుకునే కథలుగా మారుతాయి. ఈ నేపథ్యంలోనే, ప్రతి ఒక్కరి జీవితంలోని ఆసక్తికర విశేషాలను పాఠకులకు చేరువ చేయాలన్న ఉద్దేశ్యంతో 'ఓయో కథలు' ప్రారంభించాం.
 

OYOKathalu

మీ జీవితంలో కూడా ఆసక్తికరమైన కథలు ఉంటే, వాటిని రాయడానికి సమయం కేటాయించండి. రాసిన కథలను asianetteluguent@gmail.com కి మెయిల్ చేయండి లేదా +918714631140 నంబరుకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు కోరితే వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఈ నిజ జీవిత కథలను ఏసియానెట్ తెలుగులో లో ప్రచురిస్తాం.
 

OYOKathalu

కథలు కథనాలను మీరు పంపిన తర్వాత మేం వాటిని మెరుగు పరచి కాస్త ఆసక్తికరంగా మలిచి ప్రచురిస్తాం. చాలా మంచి కథనాలను యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ ప్లాట్ ఫాం లలోనూ వీడియోలుగా మలిచి ప్రసారం చేస్తాం. మీ వ్యక్తి గత వివరాలను మీరు కోరితే తప్ప బయటకు వెల్లడించం. చాలా వరకు గోప్యంగానే ఉంచుతాం.
 


OYOKathalu

మీరే కాకుండా మీకు తెలిసిన వారి కథలను కూడా మీరు రాసి పంపవచ్చు. అయితే ఈ కథల్లో సదరు వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచాలి. అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఆలోచించండి.. మీ లైఫ్ లో ఇంట్రెస్టింగ్ అంశాలు, సంఘటనల గురించి రాయడం ప్రారంభించండి.

గమనిక: ఈ కథలను ఎలాగైనా మార్చి ప్రచురించేందుకు, ప్రచురించిన కథనాన్ని అన్ పబ్లిష్ చేసే పూర్తి అధికారం ఏసియానెట్ తెలుగుకే ఉంటుంది.
 

Latest Videos

click me!