బ్రేకప్ వల్ల మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Aug 3, 2024, 1:44 PM IST

ఒక మంచి రిలేషన్ షిప్ బ్రేకప్ అయితే కేవల బాధొక్కటే కాదు.. దీని ప్రభావం మీ శరీరంపై కూడా పడుతుంది. అవును బ్రేకప్ ప్రభావం కేవలం మీ గుండె, మనసుపై మాత్రమే కాకుండా.. ఇది మీ శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా? 
 

రిలేషన్ షిప్ ఆనందంగా, అందంగా ముందుకు సాగిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అవుతుంటుంది. కానీ మంచి రిలేషన్ షిప్ లో ఉన్నవారు విడిపోతే ఈ బ్రేకప్ వల్ల కేవలం బాధ మాత్రమే కాదు.. ఎన్నో వ్యాధులు కూడా వస్తాయి. అవును ఈ బ్రేకప్ వల్ల బాధ ఎక్కువయ్యి కొన్ని రోజుల పాటు మెదడు పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత ఫ్యూచర్ లో పూర్తిగా అభద్రతా భావం ఏర్పడుతుంది. దీని నుంచి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ ఈ బ్రేకప్ బాదవల్ల మీ ఆనందం కోసం మీరు ఏమీ ఆలోచించలేరు. అసలు మంచి రిలేషన్ షిప్ బ్రేకప్ అయితే శరీరంలో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

నిద్రకు భంగం

బ్రేకప్ తర్వాత కొన్ని రోజుల వరకు చాలా మందికి విశ్రాంతి ఉండదు. సరిగ్గా నిద్రపోరు. దీనివల్ల మొత్తం నిద్ర షెడ్యూల్ దెబ్బతింటుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల బాగా ఒత్తిడికి లోనవుతారు. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే ఇలాంటి సందర్భంలో మీరు ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రతిరోజూ రాత్రిపూట వేడినీళ్లతో స్నానం చేసి మైండ్ రిలాక్స్ పాటలు వినడానికి ప్రయత్నించండి. 


హై బీపీ సమస్యలు

బ్రేకప్ వల్ల అధిక రక్తపోటు సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో చాలా మందికి గుండెపోటు నుంచి స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ వ్యాధుల బారిన పడకూడదంటే మీరు ఒంటరిగా ఏదీ ఆలోచించకుండా ఇతరులతో మాట్లాడటానికి ప్రయత్నించండి. 
 


చర్మ సమస్యలు

బ్రేకప్ తర్వాత బాధతో సతమతమయ్యే వారికి మొటిమలు బాగా అవుతాయి. ఎందుకంటే వీరు బాధలో పడి చర్మ సంరక్షణ మర్చిపోతారు. ఈ సమస్యను అధిగమించడానికి మీరు మీ అవసరాలను పట్టించుకోకుండా ఉండకూడదు. చర్మ సంరక్షణ ఖచ్చితంగా చేయాలి. 
 

భావోద్వేగ ఆహారం

బ్రేకప్ తర్వాత చాలా మంది ఫ్రెండ్స్ కు దూరంగా ఉంటారు. దీనివల్ల ఒంటరిగా అనిపించి రకరకాల ఫుడ్ కోరికలు కలుగుతాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఈ సమయంలో మీరు ఎక్కువగా తీపి లేదా చాలా కారంగా ఉండే వాటిని తినాలనుకుంటారు. కానీ ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. అందుకే ఇలాంటి సమయంలో మీరు బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. 
 

బలహీనమైన రోగనిరోధక శక్తి

బ్రేకప్ తర్వాత ఒత్తిడి కలిగి రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. దీనివల్ల మీరు తరచుగా అనారోగ్య బారిన పడతారు. లేదా అలసటగా ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు  మీ ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటిని చేర్చాలి. 

Latest Videos

click me!