తల్లి కావాలని ఆశతో ఫర్టిలిటీ సెంటర్లకు వచ్చిన మహిళలకు తన వీర్యాన్నే ఇచ్చిన ఓ స్మెర్మ్ స్కాం డచ్ లో బయటపడింది. డచ్ లోని ఓ ఆస్పత్రిలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో 17మంది ఇలా డాక్టర్ వీర్యంతో తల్లులయ్యారు.
జాన్ వైల్డ్‌షట్ అనే మేల్ గైనకాలజిస్ట్ ఒకరు 1981 నుండి 1993 వరకు సోఫియా హాస్పిటల్ ఫెర్టిలిటీ క్లినిక్‌లో పనిచేశాడు. ప్రస్తుతం ఇసాలా హాస్పిటల్ గా పిలుస్తున్న జ్వెల్లెలోని ఈశాన్య డచ్ లోని సోఫియా హాస్పిటల్ లో ఇది జరిగింది.
ఇక్కడికి సంతానభాగ్యం కోసం వచ్చిన 17 మంది మహిళలకు ఈ డాక్టర్ తన స్పెర్మ్ దానం చేశాడు. అయితే అది తనదని చెప్పలేదు. స్పెర్మ్ దాతల పేర్లు రహస్యంగా ఉంచుతారు కాబట్టి అనామక స్పెర్మ్ దాత అని చెప్పి ఈ పని చేశాడు. అయితే డాక్టర్ చేసిన ఈ పని నైతికమైనది కాదని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఈ హాస్పిటల్ లోనే కాదు వైల్డ్ షట్ డచ్ లోని KID అనే స్పెర్మ్ డోనర్ ఆసుపత్రిలోని కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ఈ స్మెర్మ్ స్కాం బయటపడ్డ కారణంగా.. వైల్డ్‌షట్ ఈ కార్యక్రమం ద్వారా ఇంకెంతమంది పిల్లల తండ్రి అయి ఉంటాడో అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
2019లో ఈ విషయం బయటపడింది. హాస్పిటల్ ఈ విషయంలో క్లియర్ గా ఉండాలని నిర్ణయించుకుంది. అందుకే డాక్టర్ కుటుంబానికి, స్పెర్మ్ దానం తీసుకున్న కుటుంబాలకు విషయాన్ని తెలపాలని నిర్ణయించింది.
ఓ కమర్షియల్ డాటా బేస్ ద్వారా ఈ విషయం బయటపడింది. ఓ డిఎన్ఎ డాక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం వైల్డ్ షట్ డిఎన్ఎ, ఓ పిల్లాడి డిఎన్ఏ తో మ్యాచ్ కావడంతో విషయం బయటపడింది.
విషయం తెలిసే సరికే వైల్డ్ షట్ మరణించాడు. 2009లో ఆయన మరణించాడు.
పేరు చెప్పడానికి ఇష్టపడని తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు డాక్టరే తండ్రి అని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. అంతేకాదు వైల్డ్ షట్ చాలా మంచి వ్యక్తి అని, నిబద్ధత కలిగిన వ్యక్తి, అని నిజాయితీ గల వ్యక్తిలా కనిపించేవాడని అన్నారు.
అయితే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో సరైన నియమాలు లేని సమయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి దీనిమీద లాస్యూట్ ఫైల్ చేయడానికి డచ్ హెల్త్ అఫీషియల్స్ నిరాకరించారు.
గత సంవత్సరం, నెదర్లాండ్ల్స్ లో ఇలాంటి సంఘటనే ఒకటి బయటపడింది. ఓ డబ్ వైద్యుడు తన వీర్యాన్నే ఇచ్చి 49 మంది పిల్లలకు తండ్రయ్యాడు.