ఇలాంటి భాగస్వామి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు..

First Published | Aug 27, 2023, 3:45 PM IST

ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తారో? లేదో? చెప్పడం చాలా కష్టం. కానీ మీ భాగస్వామి కొన్ని పనులను చేస్తే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలే ఉండవని నిపుణులు చెబుతున్నారు. 
 

మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నాడని మీరు ఆందోళన చెందుతున్నారా? ఈ ఆలోచనే మిమ్మల్ని ఎంతో ఒత్తిడికి గురించి చేస్తుంది. ఒంటరిని చేస్తుంది. అయితే మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేయరని సూచించే కొన్ని సంకేతాలున్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు అనుమాన పడాల్సిన అవసరం లేదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

మీతో నిజాయితీగా ఉంటారు

మోసం చేసే భాగస్వామి వారి భావాలను మీతో పంచుకోరు. అలాగే మీతో నిజాయితీగా ఉండరు. మీ భాగస్వామి ప్రతి ఆలోచనను మీతో పంచుకుంటూ మీతో నిజాయిగా ఉంటే వారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. ఏదైనా వారిని ఇబ్బంది పెడుతుంటే నిర్మొహమాటంగా మీకు చెప్తారు. అలాగే ఎలాంటి సంకోచం లేకుండా వారి కోరికలు, అవసరాలను కమ్యూనికేట్ చేస్తారు. ఈ రకమైన నిజాయితీ ఏదైనా సంబంధానికి ముఖ్యమైనది. ఇది భాగస్వాముల మధ్య నమ్మకాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
 


మీ పట్ల గౌరవం 

మీ భాగస్వామికి మీ పట్ల, మీ సంబంధం పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉండాలి. మీ భాగస్వామి ఎప్పుడూ మీ అభిప్రాయాలను, భావాలను గౌరవిస్తే.. వారు మిమ్మల్ని మోసం చేయరనడానికి సంకేతం కావొచ్చు. నిజాయితీగా ఉండే భభాగస్వామి మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. అలాగే మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు. 

మీతో సమయం గడిపే ప్రయత్నం 

మోసం చేసే భాగస్వామి సాధారణంగా ముఖ్యమైన వ్యక్తులతో తక్కువ సమయం గడుపుతారు. ఎందుకంటే వారి దృష్టి  మరొకరిపై ఉంటుంది. మీ భాగస్వామి మీతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపిస్తే వారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. మీ భాగస్వామి మీకు దూరంగా ఉన్నా ఫోన్ లో మాట్లాడుతారు. వీరు ఎన్నటికీ మోసం చేయరు. మీ గురించి నిజంగా శ్రద్ధ వహించే భాగస్వామి వారి బిజీ షెడ్యూల్ లేదా జీవిత ఒత్తిళ్లతో సంబంధం లేకుండా మీ కోసం సమయాన్ని కేటాయిస్తారు. 
 

మీ భావాలకు ప్రాధాన్యతనిస్తారు

మీ భాగస్వామి ఎప్పుడూ మీ భావాలకు ప్రాధాన్యతనిస్తే వారు మిమ్మల్ని మోసం చేయరు. మోసం చేసే భాగస్వామి సాధారణంగా మీ భావాల కంటే వారి స్వంత కోరికలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వారు ఇతరులకన్నా తమను తాము సంతోషపెట్టడంపైనే ఎక్కువ దృష్టి పెడతారు. కానీ మీ గురించి నిజంగా శ్రద్ధ వహించే భాగస్వామి మిమ్మల్ని మానసికంగా లేదా శారీరకంగా బాధపెట్టే లేదా హాని కలిగించే ఏదీ చేయరు. వారు అన్నింటికంటే మీ భావాలకు ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు మీ అభిప్రాయాన్ని కచ్చితంగా తెలుసుకుంటారు. 

Latest Videos

click me!