ప్రసవం తర్వాత కలయిక.. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు

First Published | Dec 22, 2023, 3:46 PM IST

ప్రసవం తర్వాత.. లైంగిక కార్యకలాపాల సమయంలో ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు. దీని వల్ల మహిళలు ఎంతో బాధపడాల్సి వస్తుంది. అందుకే దీని గురించి కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 
 

Sex Life

నార్మల్ డెలివరీ అయినా, సిజేరియన్ అయినా సరే.. ప్రసవం తర్వాత లైంగికంగా చురుకుగా ఉండటానికి ముందు సురక్షితమైన లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రసవం తర్వాత జరిగే లైంగిక కార్యకలాపాల్లో సమాచార లోపం వల్ల జంటలు ఎన్నో పొరపాట్లు చేస్తుంటారు. దీనివల్ల ఆడవారు ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది.  ప్రసవం తర్వాత సురక్షితమైన సెక్స్ పద్ధతులను తెలుసుకోవడం మహిళలే కాదు, పురుషుల బాధ్యత కూడా. 
 


డెలివరీ తర్వాత ఎన్ని రోజులకు సెక్స్ లో పాల్గొనొచ్చు 

ప్రసవం తర్వాత కనీసం 6 వారాల పాటు మహిళలు తమ భాగస్వామితో శారీరకంగా దగ్గరగా ఉండకూడదని నిపుణులు చెప్తారు. సిజేరియన్ లేదా నార్మల్ డెలివరీ రెండింటిలో.. యోని దాని సాధారణ స్థితికి తిరిగి రావడానికి 6 వారాల సమయం పడుతుంది. దీనికి ముందు ఆడవారికి ఉత్సర్గ ఉంటుంది. ఇది రక్తంతో వస్తుంది. అలాగే కొంతకాలం తర్వాత అది గోధుమ రంగులోకి మారుతుంది. కాగా ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవారి శారీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. డెలివరీ తర్వాత ఇవి సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది. అందుకే ఈ సమయంలో అసౌకర్యం, సంక్రమణను నివారించాలనుకుంటే 6 వారాల పాటు లైంగిక కార్యకలాపాలలో పాల్గొనకండి. డెలివరీ తర్వాత లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేముందు ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. 
 


ఫోర్ ప్లే సమయాన్ని పెంచండి

ప్రసవం తర్వాత మళ్లీ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనుకుంటే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు ఫోర్ ప్లేలో  ఎక్కువ సేపు పాల్గొనొచ్చు. ఇది యోనిని సహజంగా లూబ్రికేట్ చేస్తుంది. ఇది సెక్స్ కోసం పూర్తిగా సిద్ధం కావడానికి కూడా సహాయపడుతుంది. దీనివల్ల సంభోగం సమయంలో నొప్పి ఉండదు. 
 

గర్భనిరోధక పద్ధతిని ఉపయోగించడం

ప్రసవానంతరం మహిళలు తల్లిపాలను ఇస్తారు. అందుకే ఈ సమయంలో రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని నిపుణులు చెప్తారు. ఎందుకంటే ఇది అవాంఛిత గర్భానికి దారితీస్తుంది. అలాగే సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే కండోమ్స్ వంటి సురక్షితమైన గర్భనిరోధకాలను వాడండి. తల్లి పాలిచ్చేటప్పుడు మందులను నివారించాలి. ఎందుకంటే ఇది మీ పాల నుంచి బదిలీ అయ్యి మీ బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
 

భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి

డెలివరీ తర్వాత లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలనుకుంటే దాని గురించి మీ భాగస్వామితో ముందు బహిరంగంగా మాట్లాడండి. దీనికి మీ భార్య పూర్తిగా సిద్ధంగా లేకపోవే లైంగిక కార్యకలాపాలలో పాల్గొనకండి. ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ లైంగికంగా యాక్టివ్ అవ్వాలంటే మహిళలు తమ శరీరంతో పాటుగా మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. అందుకే దీని గురించి మీ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడండి. అలాగే లైంగిక కార్యకలాపాల సమయంలో మీకు ఎక్కడ అసౌకర్యంగా అనిపించినా.. వెంటనే భాగస్వామిని ఆపి మీ పరిస్థితి గురించి వారికి చెప్పండి. ఇది లైంగిక ఆనందాన్ని పెంచడమే కాకుండా మీ ఇద్దరి మధ్య అవగాహన, బంధాన్ని బలోపేతం చేస్తుంది.

sex life

కెగెల్ వ్యాయామాలు చేయండి

కెగెల్ వ్యాయామాలు మీ కటి కండరాలను పునర్నిర్మించడానికి సహాయపడతాయి. ఇది డెలివరీ తర్వాత సర్వసాధారణమైన సమస్యలలో ఒకటి. దీనివల్ల మహిళలు తరచుగా మూత్రవిసర్జనతో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాయామం కటి కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది మీరు లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడాన్ని సులభతరం చేస్తుంది. మీ ఆనందాన్ని కూడా పెంచుతుంది.
 

పరిశుభ్రత 

మహిళలు ప్రసవం తర్వాత లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడానికి ముందు, తర్వాత సరైన పరిశుభ్రత పాటించాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రసవం తర్వాత యోని మరింత సున్నితంగా మారుతుంది. ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.  ఆడవారే కాదు పురుషులు కూడా పరిశుభ్రతను పాటించాలి.

Latest Videos

click me!