బంధాన్ని నిలబెట్టుకోవడం అంత సులువేం కాదు. బంధం బలపడటానికి భాగస్వాముల మధ్య నమ్మకం ఉండాలి. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇద్దరికీ మంచి అవగాహన అవసరం. కానీ కొన్ని కొన్ని సార్లు దీనిని నిర్వహించడంలో విఫలమవుతారు. దీనికి కారణాలను కూడా తెలుసుకోరు. దీనివల్లే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు, కొట్లాటలు వస్తాయి. అంతేకాదు ఇవే మీరు విడిపోయే వరకు తీసుకెళతాయి. అందుకే రిలేషన్ షిప్ లో విభేదాలను తగ్గించుకోవడానికి.. మీ రిలేషన్ షిప్ ను బలోపేతం చేసుకోవడానికి సహాయపడే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అభినందిస్తూ..
మీ భాగస్వామి మీ కోసం ఎన్నో పనులను చేస్తుంటారు. అందుకే ఇలాంటి విషయాల్లో వారిని అభినందించండి. ఇలా చేస్తే వారు మీతో ఉంటున్నందుకు ఎంతో సంతోషిస్తారు. బాధపడరు. అంతేకాదు మీరు వారికి దొరకడం అదృష్టంగా కూడా భావిస్తారు. కాబట్టి మీకోసం మీకు ఇష్టమైన వంటను చేసి పెట్టినప్పుడు వారిని మెచ్చుకోండి. అలాగే వాళ్లకు ఇష్టమైన సినిమాను కలిసి చూడటం వంటి చిన్న పనులను చేయండి. ఇవి కూడా మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
క్వాలిటీ టైమ్
మీరెంత బిజీగా ఉన్నా మీ భాగస్వామితో కాసేపైనా గడపండి. అలాగే మీమీ అభిరుచులను తెలుసుకోండి. ఇది మీ మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అలాగే కలిసి సినిమాలు చూడండి లేదా మీ భార్యను బాగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడే అవుట్ స్టేషన్ ట్రిప్ ప్లాన్ చేయండి. దీంతో మీ భార్య ఎంతో సంతోషిస్తుంది.
సహాయంగా..
మీ భర్త బాగా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు వారికి మద్దతుగా ఉండండి. వచ్చిన వెంటనే కాఫీ లేదా టీని పెట్టి ఇవ్వండి. ఆఫీసు విషయాలను తెలుసుకోండి. అతని విషయాలను షేర్ చేసుకోండి. కష్టనష్టాల గురించి తెలుసుకోండి. మీరు చేయగలిగిన సాయం చేయండి. ఇది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. లక్ష్యాలు, కలలను సాధించడానికి మీ భార్యను ప్రోత్సహించండి. మీ భాగస్వామి వారి లక్ష్యాలను సాధించడానికి ఆటంకం కలిగించకుండా వాళ్లను ప్రోత్సహించాలి.
సర్ప్రైజ్
కలిసి బయటకు వెళ్లడం, డేటింగ్ చేయడం, గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోవడం లేదా మీ భాగస్వామి ఇష్టపడే లేదా మీ భాగస్వామికి నచ్చిన దాన్ని ప్లాన్ చేయండి. ఇది రిలేషన్ షిప్ ను యాక్టివ్ గా ఉంచుతుంది. అలాగే మీ మధ్య గొడవలు, కొట్లాటలు రాకుండా చేయడానికి సహాయపడుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారో గుర్తుంచుకోవడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది.
వీటిపై శ్రద్ధ పెట్టండి
మీ భాగస్వామి చెప్పేది ఏదైనా సరే జాగ్రత్తగా వినండి. దాని గురించి మాట్లాడుకోండి. వారు సమస్య పరిష్కారం గురించి మిమ్మల్ని అడగరు. కేవలం మీ మద్దతునే అడుగుతారు. ఇది వారికి ఎంతో అండగా ఉంటుంది. ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. వాళ్ల ఆలోచనలు, భావాలకు ఎలాంటి డిస్టబెన్స్ కలిగించకుండా వారు చెప్పేది వినడానికి ప్రయత్నించండి.