శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలంటే వీటిని తినండి

First Published | Nov 23, 2023, 3:07 PM IST

శృంగారం మీ బంధానికి మాత్రమే కాదు.. మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అవును సెక్స్ మీ ఒత్తిడి, అధిక రక్తపోటు, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది. సెక్స్ లో ప్రయోజనాలను పొందాలంటే మాత్రం మీరు లైంగిక జీవితంలో చురుగ్గా ఉండాలి. అయితే కొన్ని ఆహారాలను తింటే మీరు సెక్స్ లో చురుగ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
 

సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడేవారు ఉండనే ఉండరు. అందుకే దీనివల్ల కలిగే ప్రయోజనాలు వీళ్లకు తెలియవు. శారీరక సంబంధాలు అంటే కేవలం పిల్లల్ని కనడం మాత్రమే కాదు. ఇది మీ శారీరక, భావోద్వేగ అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా ఇది మీకు, మీ భాగస్వామికి మధ్య ప్రేమ బంధాన్ని పెంచుతుంది. అందుకే దీని గురించి భార్యాభర్తలు మాట్లాడుకోవాలని చెప్తుంటారు. 
 

మీకు తెలుసా? ఒత్తిడి  మీ లైంగిక జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు పిల్లలు, కొన్నిసార్లు కుటుంబ బాధ్యతలు, కొన్నిసార్లు పని మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఒత్తిడి లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల  లైంగిక ఉద్రేకం లేకపోవడం లేదా లైంగిక కోరికలు తగ్గుతాయి.  సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉన్నవారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ లైంగిక జీవితం మెరుగ్గా ఉండాలంటే కొన్ని ఆహారాలను తినాలంటున్నారు. ఇవి సహజంగా మీ సెక్స్ డ్రైవ్ ను పెంచుతాయి. ఇందుకోసం ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


మాంసాహారం

చికెన్, మటన్ వంటి మాంసాలు మీ ఆరోగ్యానికే కాదు మీ లైంగిక జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మాంసంలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.  ఇది మీ రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే మిమ్మల్ని లైంగికంగా చురుగ్గా ఉంచుతుంది. పబ్ మెడ్ సెంట్రల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. మాంసంలో ఉండే కార్నిటైన్, అర్జినిన్, జింక్ అంగస్తంభన లోపాన్ని పోగొడుతాయి.  
 

సాల్మన్ ఫిష్

చేపలు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. సాల్మన్ ఫిష్ మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. సాల్మన్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే మిమ్మల్ని గుండె జబ్బులకు దూరంగా ఉంచుతాయి. అలాగే  లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

గింజలు, విత్తనాలు

అన్ని రకాల గింజలు, విత్తనాలు మీ ఆరోగ్యానికే కాకుండా  సెక్స్ లైఫ్ కు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. బాదం, వాల్ నట్స్, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, హాజెల్ నట్స్, వేరుశెనగ, అవిసె గింజలు మొదలైన వాటిలో జింక్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. 
 

beetroot juice

బీట్రూట్

బీట్రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ బీట్ రూట్ లు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లకు భాండాగారం. జర్నల్ ఆఫ్ ది సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో ఒక వ్యాసం ప్రకారం.. బీట్ రూట్ రసంలో నైట్రేట్ ఉంటుంది. ఇది రక్తానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది సెక్స్ సమయంలో స్టామినాను పెంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం బీట్ రూట్ జ్యూస్ లేదా సూప్ ను మీ డైట్ లో చేర్చుకోవచ్చు.

ashwagandha

అశ్వగంధ

అశ్వగంధను ఆయుర్వేదంలో ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీ లైంగిక జీవితానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మహిళలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జర్నల్ ఆఫ్ బయోమెడ్ రీసెర్చ్ సెంటర్ లో దీనికి సంబంధించిన పరిశోధనలు కూడా ఉన్నాయి. వీటి ప్రకారం.. ఎనిమిది వారాల పాటు అశ్వగంధను తీసుకుంటే మీ సెక్స్ డ్రైవ్  మెరుగుపడుతుంది. ఇది మీరు భావప్రాప్తి పొందడానికి కూడా సహాయపడుతుంది.

Latest Videos

click me!