అమ్మాయి ఎరుపు రంగు చీరలో...నాలుగు నిమిషాలు చాలట!

First Published | Feb 10, 2020, 3:23 PM IST

ఎవరైనా అమ్మాయి అందంగా కనిపించినా.. తమకు నచ్చిన అమ్మాయి వచ్చినా.. అబ్బాయిలు నిటారుగా నిలపడతారట. అంతేకాకుండా ఫిట్ గా కనిపించాలని తాపత్రయపడతారట.
 

ప్రేమ గురించి సినిమాల్లో పాటలు, డైలాగులు మనం చూస్తూనే వింటాం. ప్రేమలో పడనివారికి సినిమాల్లో చూపించినవి కాస్త సిల్లీగా అనిపిస్తుంటాయి. అయితే... అన్నీ నిజం కాకపోయినా.. చాలా వరకు సినిమాల్లో చూపించినట్లే జరుగుతాయంటున్నారు నిపుణులు.. వాలంటైన్స్ డే దగ్గరపడుతున్న సందర్భంగా ప్రేమ గురించి , ప్రేమ మైకంలో మునిగి తేలుతున్న వారి కోసం కొన్ని ఆసక్తికర విషయాలు...
కొత్తగా ప్రేమలో ఉన్నవారికి తాము ప్రేమించిన మనిషి కాస్త దగ్గరగా వచ్చినా సరే... గుండె మనకు తెలీకుండానే చాలా వేగంగా కొటుకుంటుందట. ఇక వారు తగిలినా, ముట్టుకున్నా.. మరింత వేగంగా కొట్టుకుంటుంది.

ఎవరైనా అమ్మాయి అందంగా కనిపించినా.. తమకు నచ్చిన అమ్మాయి వచ్చినా.. అబ్బాయిలు నిటారుగా నిలపడతారట. అంతేకాకుండా ఫిట్ గా కనిపించాలని తాపత్రయపడతారట.
అవతల వ్యక్తి మీకు నచ్చారో లేదో ఆలోచించి మీ మొదడు కేవలం నాలుగు నిమిషాల్లోనే చెప్పేస్తుందట. మీ మనసుకి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు కానీ... మెదడుకి మాత్రం నాలుగు నిమిషాలు చాలట
చాలా మంది కొత్తగా ఎవరైనా అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ పరిచయం చేసుకునేటప్పుడు కాస్త కంగారుపడుతుంటారు. దానికి శరీరంలోని కార్టిసాల్ అనే రసాయనం కారణం.
కొంతమంది ప్రేమ పేరు ఎత్తితేనే భయపడిపోతుంటారు. దానిని ఫైలోబియా అంటారు. ఇంకొందరికీ అసలు ప్రేమ ఫీలింగే కలగదు. దానిని హైపోపిట్యూటరిజం అంటారు.
కారణాలేంటో తెలీదు కానీ... అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నప్పుడు అబ్బాయిలు ఎక్కువ ఎట్రాక్షన్ కి గురౌతారట. వారితో ఎక్కువ సేపు మాట్లాడాలని అనుకుంటారట.
డ్రగ్స్ వాడితే మెదడు ఎలా ఎఫెక్ట్ అవుతుందో.. ప్రేమలో పడినప్పుడు కూడా అలానే ఫీలౌతారట. అడ్రినలిన్, డోపమైన్, వాసోప్రెసన్ వంటి హార్మోన్లు విడదలవ్వడం వల్లే అలా జరుగుతందట.
మనసుకి నచ్చినవారిని గాఢంగా హత్తుకుంటే ఒంటి నొప్పులు ఇట్టేపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో లేకపోతే వారి ఫోటోలను చూసినా కూడా ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలయ్యి నొప్పులు తగ్గిపోతాయట.
మనస్ఫూర్తిగా ఓ వ్యక్తిని ప్రేమించేవాళ్లు... శరీరాకృతి కన్నా కూడా ముఖాన్ని ఎక్కువగా చూసి ఇష్టపడతారట. ఇక అమ్మాయిలు తమ ప్రియుడు ఎదురుగా కూర్చొని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తే బాగుండని కోరుకుంటారట. అబ్బాయిలు మాత్రం పక్కపక్కన కూర్చొని మాట్లాడటానికి ఇష్టపడతారట.

Latest Videos

click me!