ఏ బంధమైనా నిలపడలంటే ప్రేమ ఎంత ఉండాలో.. నమ్మకం కూడా అంతే ఉండాలి. మరీ ముఖ్యంగా దంపతులకు అది తప్పనిసరి. ఇద్దరిలో ఏ ఒక్కరికి మరొకరిపై ప్రేమ తగ్గిపోయినా.. వారి మధ్యలోకి మూడో వ్యక్తి ప్రవేశించినా.. వారి మెదడులోకి మోసం చేయాలనే ఆలోచన వచ్చినా.. ఒక్కసారి నమ్మకం పోయినా ఆ బంధం నిలపడటం కష్టం.
ఓ దంపతుల మధ్య అదే జరిగింది. చక్కగా సాగుతున్న సంసారంలోకి భార్య... మూడో వ్యక్తికి చోటు ఇచ్చింది. ఈ విషయంపై అనుమానం వచ్చిన భర్త.. ఆమెను నిలదీయాలని అనుకోలేదు.
భార్య చేస్తున్న పనిని అందరికీ చెప్పి పబ్లిక్ గా రచ్చచేసి ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకున్నాడు. అదే చేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన వ్యక్తికి 1997 జులై7వ తేదీన వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో ఆనందంగా వారి జీవితం సాగిపోతోందనుకనే సమయంలో ఆమెకు భర్త బోర్ కొట్టాడు.
కొత్తదనం కావాలని కోరుకుంది. అందులో భాగంగానే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో భర్తకు కూడా అనుమానం కలిగింది. తన భార్య తనను మోసం చేస్తుందేమో అనే అనుమానం కలిగింది.
ఒకరోజు అతనిని బిజినెస్ పని మీద వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు భార్యకు తెలీకుండా ఇంట్లో రహస్య కెమేరాలు పెట్టి ప్రశాంతంగా వెళ్లాడు. అది తెలియని భార్య.. తన ప్రియుడిని ఇంటికి రప్పించుకుంది.
ఆ ప్రియుడితో హాయిగా శృంగారంలో పాల్గొని ఎంజాయ్ చేసింది. అందంతా కెమేరాల్లో రికార్డు కావడంతో... వాటిని పట్టుకొని వెళ్లి విడాకులకు అప్లై చేశాడు ఆ భర్త.
ఇలా బెడ్‌రూంలో వీడియో రికార్డర్ పెట్టడాన్ని తప్పుపట్టిన కోర్టు... సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో... విడాకులకు ఓకే చెప్పింది.కింది కోర్టు తీర్పును ఆమె 2013 జులై 30న హైకోర్టులో సవాల్ చేశారు.
తన భర్తకు పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ తీసే అలవాటు ఉందన్న ఆమె... తనను బలవంతంగా అలాంటి వాటిలో నటించేలా చేయిస్తున్నారని ఆరోపించారు.
ఆ వీడియోలో ఉన్నది కూడా అలాంటిదే అన్నారు. తన భర్త బెంగళూరు వెళ్లలేదనీ... ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అందువల్ల విడాకులు ఇవ్వాలన్న కింది కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరారు.
అయితే... ఆ వీడియోలను చూస్తుంటే ఆమె బలవంతంగా శృంగారంలో పాల్గొన్నట్లేదని.. ఇష్టపూర్వకంగానే పాల్గొన్నట్లు ఉందని కోర్టు పేర్కొంది. అంతేకాకుండా వారి కుమార్తెల నుంచి కోర్టు కొన్ని నిజాలు తెలుసుకుంది.
తండ్రి ఊరువెళ్లినప్పుడు తమ తల్లి ఓ వ్యక్తిని ఇంటికి రప్పించుకుందని వారు చెప్పడంతో.. సదరు మహిళదే తప్పుగా న్యాయస్థానం పేర్కొంది. వెంటనే సదరు దంపతులు ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.