మనలో ఎదుటివారిపై లెక్కలేనంత ప్రేమ ఉండగానే సరిపోదు. దానిని అప్పుడప్పుడు అయినా ఏదో ఒక విధంగా మనం వారిపై చూపిస్తేనే.. వారు కూడా ఆనందిస్తారు. ముఖ్యంగా భార్యభర్తలు మాత్రం అప్పుడప్పుడు అయినా రొమాంటిక్ గా ఉండాలి. మీలోని రొమాంటిక్ ఫెలోని నిద్రలేపి.. మీ ప్రియసఖిని మెప్పించాలి. కానీ ఎలా మెప్పించాలో మీకు తెలియడం లేదా..? ఇదిగో ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వండి.
కొన్నిసార్లు నోటితో చెప్పే మాటలకన్నా.. అక్షరాలు చాలా అందంగా ఉంటాయి. అది కూడా కంప్యూటర్ లో టైపు చేసినవి కాకుండా.. స్వయంగా చేతులతో రాసి.. దానిని మరింత అందగా అలంకరించి నచ్చిన వారికి ఇవ్వాలి. ఆ లేఖలో.. మీలోని భావాలను కవితల రూపంలోకూడా చెప్పొచ్చు. ఇది చాలా రొమాంటిక్ గా ఉంటుంది.
చాలా మంది మద్దు కేవలం శృంగారానికి సంబంధించినది భావిస్తుంటారు. కానీ.. అంతకు మించిన భావన ఈ ముద్దులో ఉంటుంది. పిల్లలను ముద్దు పెట్టుకోవడానికి మనకు ఏదైనా కారణం ఉంటుందా..? అలాగే.. ఇష్ట సఖిని కూడా ప్రేమగా ముద్దాడాలి. ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్ చెబుతూ.. రాత్రి పడుకునే ముందు.. గుడ్ నైట్ చెబుతూ.. ముద్దు పెడితే ఆ ఫీల్ బాగుంటుంది.
మీరు ఇష్టపడేవారు.. మీతో ప్రేమగా.. ఆనందంగా ఉండాలని కోరుకోగానే సరిపోదు. అందుకు మీ వంతు ప్రయత్నం చేయాలి. వారు ఏదైనా చెప్పాలి అని ప్రయత్నించినప్పుడు.. కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఓపికగా వినాలి. అలా చేస్తే.. వారు మీకు దాసోహం అయిపోతారు.
ఇద్దరూ రోజూ కలిసే ఉంటున్నా.. సరదాగా ఎప్పుడైనా ఇద్దరూ కలిసి బయటకు వెళ్లాలి. డిన్నర్ డేట్ కి గానీ.. లంచ్ కానీ కలిసి చేస్తే.. అది కూడా స్పెషల్ గా ఉండేలా చూసుకోవాలి. ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది.
అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ ప్రైజ్ లు కూడా ఇస్తూ ఉండాలి. ఆ సర్ ప్రైజ్ లోనూ మీలోని రొమాంటిక్ యాంగిల్ బయటకు తీయాలి.
చిన్న పొగడ్త.. ఇది కూడా ప్రేమను బయటకు తీస్తుంది. అప్పుడప్పుడు చిన్న పాటి ప్రశంస కూడా రొమాంటిక్ ఫీలింగ్ కలిగిస్తుంది.
ప్రేమను తెలియజేయడానికి కేవలం ఐలవ్ యూ అనే పదం చెబితే సరిపోదు.. అప్పుడప్పుడు.. చిన్న చిన్న కవితల ద్వారా.. ఇంకా కొత్తగా చెబితే కూడా బాగుంటుంది.
ఇద్దరూ కలిసి బైక్ పై షికారుకి వెళ్లడం.. ఏదైనా అడ్వెంచర్ చేయడం, ఏవైనా సరదా పనులు చేయడం కూడా రొమాంటిక్ గానే ఉంటుంది.