సెక్స్: అడగాలంటే మొహమాటం...కోరిక బయటపెట్టేదెలా..?

First Published | Jul 14, 2021, 10:39 AM IST

నోరు తెరిచి డైరెక్ట్ గా చెప్పకుండా.. మీరు కావాలనే విషయాన్ని.. మీ పార్ట్ నర్ కి కేవలం కొన్ని యాక్షన్స్ ద్వారా తెలియజేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

శృంగారం పట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ.. ఎందుకో దాని గురించి మాట్లాడుకోవడానికి మనలో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పది మందిలో మాట్లాడటానికి ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ... చాలా మంది కనీసం తమ పార్ట్ నర్ దగ్గర కూడా మొహమాట పడిపోతున్నారట. తమ భార్యతో సెక్స్ కావాలని కూడా అడగలేక... మనసులో కోరికను చంపుకుంటున్న వారు కూడా ఉన్నారట.
మరి.. నోరు తెరిచి డైరెక్ట్ గా చెప్పకుండా.. మీరు కావాలనే విషయాన్ని.. మీ పార్ట్ నర్ కి కేవలం కొన్ని యాక్షన్స్ ద్వారా తెలియజేయవచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

కేవలం స్పర్శ ద్వారా.. సెక్స్ కావాలని అనుకుంటున్నారో లేదో తెలియజేయవచ్చట. ఈ క్రమంలో... మీ పార్ట్ నర్ చేతిని మీ చేతితో హోల్డ్ చేయాలట. ఇలా చేయడం వల్ల.. ఆ స్పర్శతో.. మీ మనసులోని అభిప్రాయాన్ని వారు అర్థం చేసుకోగలరట. అయితే... ఇలా కేవలం.. గదిలో మీ ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు చేస్తేనే ఆ అర్థం వస్తుంది. అందరి ముందు చేస్తే.. అలా అర్థం చేసుకోరనే విషయాన్ని గమనించాలి.
మీ భార్య మీ కోసం అందంగా ముస్తాబు అయితే.. ఆ విషయాన్ని మీరు ఆమెకు తెలియజేయాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు... నీ డ్రెస్ చాలా బాగుంది లాంటి మాటలకు ఆమెకు మరింత ఎనర్జీని ఇస్తాయి. ఆమెలో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరుగుతాయి. ఇక సెక్స్ విషయానికి వస్తే.. మీ అర చేతిని ఆమె నడుము దగ్గరకు పోనిచ్చి.. సున్నితంగా తాకాలి. అలా తాకడం వల్ల మీ మనసులోని భావనను వారు అర్థం చేసుకోగలుగుతారు.
పువ్వులు ఇచ్చే సువాసన.. రొమాంటిక్ ఫీలింగ్ ని కలిగిస్తాయి. అవి.. మహిళల తలలో ఉన్నా.. లేదా.. పడక గదిలో బెడ్ మీద ఉన్నా.. ఆ రొమాంటిక్ భావన కలుగుతుంది. కాబట్టి.. మీకు సెక్స్ కావాలనే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పలేకపోయినప్పుడు.. పూలతో మీ బెడ్ ని అలకరించండి. ఆమె వెంటనే అర్థం చేసుకోగలుగుతుంది.
స్టిక్కీ నోట్స్ తో కూడా చెప్పొచ్చు. మీ భార్య మాత్రమే చూసే ప్రాంతాల్లో.. మీ మనసులోని మాటను రాసి.. స్టిక్కీ నోట్స్ అంటిస్తే సరిపోతుంది. దానిని చూసినప్పుడు ఆమె అర్థం చేసుకోగలుగుతుంది.
మీ భార్యకు లో దుస్తులు కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. మీరు కొత్త విధంగా కలయికను ఆస్వాదించాలని కోరుకుంటున్నారనే విషయాన్ని.. ఈ లో దుస్తుల ద్వారా తెలియజేయవచ్చు. వాటిని తీసుకువెళ్లి.. బెడ్ మీద ఉంచండి.
ఇన్ని రకాలుగా.. మీరు మీ మనసులో మాటను చెప్పకనే చెప్పొచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి.

Latest Videos

click me!