Relationship: ఆ విషయంలో అసంతృప్తా.. అయితే ఇలా చేసి చూడండి!

First Published | Jun 28, 2023, 2:30 PM IST

Relationship: పెళ్లయిన ప్రతి జంటా ఆసక్తిగా ఎదురుచూసేది ఆ మధుర క్షణం కోసమే. కానీ ఆ విషయమే మీకు అసంతృప్తిని మిగులుస్తుందా? ఆ విషయంలో సక్సెస్ కావాలంటే ఇలా చేసి చూడండి.
 

ప్రతి జంట ఎదురుచూసే మధుర క్షణం శృంగారం. అలాంటి శృంగారం కొందరి జీవితాల్లో ఆనందాన్ని నింపితే మరికొందరి జీవితాల్లో అసంతృప్తిని నింపుతుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల మధురమైన జీవితాన్ని కోల్పోతున్నారు దంపతులు.
 

అయితే చిన్ని చిన్ని సర్దుబాట్లు చిన్నచిన్న త్యాగాలతో జీవితాన్ని సుందరమైన చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు అది ఎలాగో చూద్దాం రండి.అలాంటి సమయంలో సాధారణంగా మీ ఇష్టాలు కన్నా మీ భాగస్వామి ఇష్టాలకు ప్రాముఖ్యతను ఇవ్వండి.
 


మీ కోరికలని మీ భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడండి అలాగే అవతలి వారి అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వండి అప్పుడు వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఇద్దరి దంపతుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి.
 

ఒక్కొక్కసారి మీ భాగస్వామి మనసు బాగోలేనప్పుడు మీకుగా మీరు చొరవ తీసుకొని వారిని రెచ్చగొట్టవచ్చు. మగవాళ్ళు ఈ విషయంలో చాలా తొందరగా లొంగిపోతారు. అలాగే మీ లైఫ్ లో మీ పార్టనర్ మీకు ఎంత ముఖ్యం అనేది వారికి తెలిసే విధంగా ప్రవర్తించండి.
 

మీ ఆఫీస్ టెన్షన్స్ ఫ్యామిలీ టెన్షన్స్ ఏదీ శృంగార జీవితం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కూడా కాస్త శ్రద్ధ పెట్టండి. ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగినట్లు అనిపించిన అశ్రద్ధ చేయకుండా ఇద్దరూ టూర్స్ ప్లాన్ చేసుకోండి. ఒకరి విషయాల్లో ఒకరు హెల్ప్ చేసుకోండి.
 

నీకు నేను ఉన్నాను అనే భరోసా ఒక మనిషికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. శృంగారం అనేది శారీరక తృప్తి కోసం మాత్రమే కాదు అది మిగిలిన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని తెలుసుకోండి. ఆరోగ్యపరంగానూ మానసిక పరంగాను కూడా శృంగారం అవసరం అని తెలుసుకొని మీ జీవితానికి పూలబాటలు వేసుకోండి.

Latest Videos

click me!