పూర్వం రోజుల్లో పెళ్లయిన దంపతులకి బంధం జరుపుకోవడం అనేది అసలు విషయమే కాదు. ఎందుకంటే సమస్య అనేది వారి దగ్గరికి వచ్చే లోపు గానే పెద్దలు ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చేవారు. ఏం చేస్తే బంధం నిలబడుతుందో వాళ్లు కూడా తమ దగ్గరే ఉన్న పెద్ద వాళ్ళని చూసి నేర్చుకునే వారు.
కానీ కొత్త తరం దంపతులకు ఆ అవకాశం లేదు. ఎందుకంటే పెళ్లి అవుతూనే వేరుకాపురం పెడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరి బంధాన్ని నిలుపుకోవడం కోసం వారే ప్రయత్నాలు ప్రారంభించాలి. అది ఎలాగో చూద్దాం రండి.
ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలో ముందుగా చేయవలసిన పని ఎదుటి వ్యక్తిని గౌరవించడం. వారు చెప్పేది వినటం, వారు చేసిన పనిని ప్రశంసించడం ఇలాంటి పనులు చేస్తుంటే ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా మీ ప్రేమలో పడిపోతారు.
చేసే పని చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రశంసించండి మీ కోసం ఏ చిన్న పని చేసినా కృతజ్ఞతలు తెలపండి. అలాగే మీతో ఉన్నప్పుడు తను బోర్ ఫీల్ అవ్వకుండా మీరు ఉత్సాహంగా ఉండి తనని ఉత్సాహంగా ఉంచండి.
అలాగే చిన్న చిన్న సర్ప్రైజ్లు, చిన్న చిన్న గిఫ్ట్ లు ప్లాన్ చేయండి. ఇది దంపతులను దగ్గర చేయటానికి సులువైన మార్గం. ఒకరు చేసే పనులలో మరొకరు సహాయం చేసుకోండి. ఎదుటి వ్యక్తి మీద చూపించే దయ జాలికి కి కూడా ఎదుటివాళ్ళు మీ ప్రేమలో పడిపోతారు.
అలాగే స్పర్శ కూడా బంధాన్ని దగ్గర చేయడంలో తోడ్పడుతుంది. మాటలతో చెప్పలేని భావాన్ని స్పర్శతో చెప్పవచ్చు అందుకే స్పర్శ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి చిన్న చిన్న పనులతోనే మన పార్ట్నర్స్ ని మనం ప్రేమిస్తూనే వాళ్లను కూడా మన ప్రేమలో పడేయవచ్చు ప్రయత్నించి చూడండి.