Relationship: లైఫ్ లో బ్రేకప్ లు నేర్పించే గుణపాఠాలు.. ఫలితం ఏదైనా అడుగు మాత్రం ముందుకే?

First Published | Jun 28, 2023, 1:56 PM IST

Relationship: నేటి కాలంలో బంధాలు చాలా తొందరగా విచ్ఛిన్నం అవుతున్నాయి. వీటివల్ల కొందరు సంతోష పడితే కొందరు బాధపడుతున్నారు. లైఫ్ లో వచ్చే బ్రేకప్ లు మంచికా, చెడుకా అనేది తెలుసుకుందాం.
 

పూర్వకాలంలో బంధం అంటే ఎంతో పవిత్రమైనది, కష్టమైనా నష్టమైనా ఒకసారి ముడి పడితే జీవితకాలం ఆ బంధాన్ని భరించవలసిందే. కానీ నేటి యువత ఎందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. తమ ఆలోచనలకు ఏమాత్రం భిన్నంగా ఉన్నా వెంటనే విడిపోవడానికి సిద్ధపడుతున్నారు.
 

చిన్న చిన్న కారణాలకే బ్రేకప్ లు చెప్పుకొని వాటికి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. అయితే ఇలా బ్రేకప్ చెప్పుకోవడం వల్ల లైఫ్ లో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే రెండింటి మిశ్రమం అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కొన్ని బంధాలను దూరం చేసుకోవడం వల్ల మాత్రమే మన భవిష్యత్తు బాగుంటుంది అన్నప్పుడు బ్రేకప్ అనేది చాలా మంచి ఆప్షన్.
 


మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు బ్రేకప్ చెప్పాల్సి వస్తుంది అలాంటప్పుడు ఈ బ్రేకప్ అనేది మనకి విపరీతమైన బాధని మిగులుస్తుంది. ఫలితం ఎలా ఉన్నా మీ అడుగు ముందుకే వేయాలి అంటూ ధైర్యం చెబుతున్నారు. సాధారణంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక బంధంలోని తీపిని కొన్నాళ్ళైనా ఎంజాయ్ చేస్తారు.
 

కొన్ని కారణాలవల్ల బ్రేకప్  చెప్పుకొని విడిపోయినా ఆ తీపి జ్ఞాపకాలు వాళ్ళని వెంటాడుతూ బాధపెడుతూ ఉంటాయి. మీ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేదా భార్య భర్తల నుంచి విడిపోయినప్పుడు తెలుసుకునే మంచి లేదా చెడ్డ విషయాలే మిమ్మల్ని మరింత బెటర్ గా మారుస్తాయి.

మీ జీవితానికి గుణపాటాలు నేర్పుతాయి. ఒకరితో బంధం తెంచుకున్నప్పుడు మీ జీవితం ముగిసిపోయినట్లు కాదు అని గుర్తుంచుకోండి ఆ బంధం కంటే మీరు చాలా గొప్పవారు ఈ విషయం గ్రహించి మీ అడుగు ముందుకు వేయండి.
 

మనకి ప్రతిరోజు ఒక వరం లాంటిది. ఆ వరంతో మన భవిష్యతిని బాగు చేసుకోవాలి అంతేకానీ బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

Latest Videos

click me!